స్వీయ నియంత్రణ, సామాజిక దూరంతో, మాస్కులు ధరించండి: మంత్రి ఎర్రబెల్లి
- హోం క్వారంటైన్ లలో ఉన్న కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఆధికారులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఒకవైపు కరోనా బాధితుల స్థితిగతులను తెలుసుకుంటూనే, మరోవైపు బాధితులకు భరోసాని, ధైర్యాన్నినింపుతూ ఇంకోవైపు ప్రజాప్రతినిధులు వారిని అందుకోవాలని చెపుతూ వారితో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, పెద్దవంగర, తొర్రూరు, రాయపర్తి మండలాల్లోని కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి సోమవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇందులో నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఆర్డీవోలు, ఎమ్మార్వో లు,సీఐ లు,ఎస్సైలు, డీఎం& హెచ్ఓ,డాక్టర్లను టెలీకాన్ఫరెన్సులోకి తీసుకుని మంత్రి వారితో మాట్లాడారు. కాగా, వారిలో అనేక మంది మంత్రి తోనూ మాట్లాడారు. వారి యోగ క్షేమాలను, తీసుకుంటున్న జాగ్రత్తలను మంత్రి ఎర్రబెల్లితో పంచుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ,అసెంబ్లీ ఉన్న కూడా మీకు మనోధైర్యం ఇవ్వడం కోసమే మీతో మాట్లాడుతున్నాను అన్నారు కరోనా తీవ్రత తగ్గిందన్నారు. సీఎం కెసిఆర్, మంత్రులు కెటిఆర్, ఈటల ఆధ్వర్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల మన రాష్ట్రంలో వైరస్ అదుపులోనే ఉందన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించడంతోపాటు, తప్పకుండా మాస్కులు ధరించాలన్నారు. ఇక కరోనా వచ్చిన వారు కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.
ప్రభుత్వం సాయంగా ఉందని, ఎంజిఎం సహా, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కరోనా పరీక్షలతోపాటు తగు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచామని చెప్పారు. కాగా, కరోనా బాధితులకు సదుపాయం కోసం తొర్రూరు, రాయపర్తి, పెద్దవంగర మండలాలకు అందుబాటులో ఉండే విధంగా తొర్రూరులో ఒక అంబులెన్స్ వాహనం, కొడకండ్ల, దేవరుప్పుల, పాలకుర్తి మండలాలకు అందుబాటులో ఉండే విధంగా ఒక అంబులెన్స్ వాహనాన్ని పాలకుర్తిలో సిద్దంగా ఉన్నాయన్నారు. కరోనా బాధితులు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మీ కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.రోగ నిరోధక శక్తి పెరిగే విధంగా ఆహారం వేడి వేడిగా తీసుకోవాలన్నారు.
- గ్రామాల వీధి దీపాలకు కొత్త వెలుగులు
- EESL అనుబంధంతో సరికొత్త జిలుగులు
- స్ట్రీట్ లైట్స్ తో స్టేట్ సెంటర్ కు అనుసంధానం
తెలంగాణ రాష్ట్రం లోని గ్రామపంచాయితీ లలో LED లైట్లు అమర్చి నిర్వహించుటకు కేంద్ర ప్రభుత్వ జాయింట్ వెంచర్ సంస్థ అయిన “ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ” జిల్లా పంచాయతీ అధికారులు మధ్య తదనంతరం ఆయా జిల్లాలో గ్రామ పంచాయతీ తరపున ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం గ్రామపంచాయితీ లలో వివిధ రకాల వీది దీపాలు అమర్చుకున్న తరువాత సరైన రీతిలో పర్యవేక్షణ లేకపోవడం వలన తరచూ లైట్లు కాలిపోవడం, మరమ్మత్తులకు గురికావడం మరియు అధిక విద్యుత్ వినియోగించవలిసి రావడం జరుగుతుంది.
ప్రస్తుత ఈ ఒప్పందం అనుసరించి EESL వారు నాణ్యమైన LED లైట్లు, ఫిక్సర్ సమకూర్చి వాటిని వీది స్తంభాల కు అమర్చి వాటిని పర్యవేక్షించే బాధ్యతను తీసుకుంటారు. దీని కోసం గ్రామ పంచాయితీలు వెంటనే ఎలాంటి పెట్టుబడి పెట్టనవసరం లేదు. వీధి లైట్లు ఆమర్చిన తరువాత నెలసరి వాయిదాలలో ESSL కు చెల్లించవచ్చు.ఈ వీధి దీపాలు నేషనల్ లైటింగ్ కోడ్ ప్రకారం ప్రకాశవంతమైన వెలుతురు ను ఇస్తాయి. “ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ స్విచ్” ఏర్పాటు చేయడం ద్వారా చీకటి పడగానే లైట్లు వెలిగేలా, ఉదయపు వెలుతురు రాగానే ఆగిపోయే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివలన విద్యుత్ వృధా ను అరికట్టవచ్చు.ఈ లైట్లలో కంప్యూటర్ చిప్ ను అమర్చడం ద్వారా దానిని రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కంప్యూటర్ లో అనుసంధానించడం వలన ఎక్కడైనా లైట్ ఆన్ చేయకపోతే వాటిని గుర్తించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
గ్రామ పంచాయితీలలో ప్రస్తుతం నేషనల్ లైటింగ్ కోడ్ ప్రకారం ఏర్పాటు చేసిన లైట్లను అలాగే ఉంచి మిగిలిన ప్రాంతాల్లో కొత్త లైట్లు ఏర్పాటు చేస్తారు. ఈ విధమైన చర్యలు తీసుకోవడం వలన గ్రామ పంచాయితీలలో అన్ని వీది దీపాలు సక్రమంగా పనిచేయడానికి లైటింగ్ కోడ్ ప్రకారం సరైన వెలుతురు ఇచ్చేలా చూడడానికి, విద్యుత్ వృధాను అరికట్టి విద్యుత్ బిల్లులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ సీఎం కేసిఆర్ గారి ఆలోచనలతో గ్రామాలు మరింత అభివృద్ధి చెంది, పల్లెలు మన రాష్ట్రానికి పట్టుగొమ్మలు గా మారుతున్నాయని అన్నారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వ జాయింట్ వెంచర్ సంస్థ అయిన EESL తో రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ కు మధ్య జరిగిన ఒప్పందంతో పల్లెల్లో LED లైట్లతో సరికొత్త వెలుగులు జిలుగులు అందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, EESL ఎక్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సౌరబ్ కుమార్, పంచాయితీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు తదితర ఆధికారులు పాల్గొన్నారు.