శాసనసభ భవనంలో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని ప్రారంభించిన తెలంగాణ శాసనసభ సభాపతి

హైదరాబాద్: శాసనసభ భవనంలో నూతనంగా ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని ప్రారంభించిన శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, పాల్గొన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పురపాలక, ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటి రామారావు, మంత్రులు ఈటెల రాజేందర్, ఎ. ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, పలువురు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు మరియు లెజిస్లేటివ్ సెక్రటరీ వి. నరసింహా చార్యులు.

తెలంగాణ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) శాఖ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్, మంత్రులు మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉపయోగించుకోవడానికి అనువుగా ఉంటుంది.

More Press News