అతి త్వరలో మిషన్ భగీరథ పనులు పూర్తి: తెలంగాణ మంత్రి పువ్వాడ
ఖమ్మం: ఇంటింటికి తాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పనుల వడివడిగా కొనసాగుతున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు.
ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించాలని ప్రభుత్వం రూ.230 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథ పనులకు గాను తన అభ్యర్ధన మేరకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కోవిడ్ పరిస్థితుల్లో కూడా రూ.61.47 కోట్ల రూపాయల విలువైన చెక్కులను L&T ప్రతినిధులకు అందజేశారు.
తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంను పూర్తి చేసి ప్రతి ఇంటికి పరిశుభ్రమైన త్రాగునీటిని అందజేస్తామన్నారు. అతి త్వరలో మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.
కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, జిల్లా కలెక్టర్ RV కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, పబ్లిక్ హెల్త్ అధికారి రంజిత్ కుమార్ తదితరులు ఉన్నారు.