ఆరోగ్య శ్రీ, ఉద్యోగ-జర్నలిస్ట్ ల హెల్త్ స్కీమ్ పై మంత్రి ఈటల సుధీర్ఘ సమీక్ష

  • ఆరోగ్య శ్రీ, ఉద్యోగ-జర్నలిస్ట్ ల హెల్త్ స్కీమ్ పై సుధీర్ఘంగా సమీక్ష నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్
  • కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ పథకం వంద రెట్లు మెరుగైనది అని ప్రకటించిన మంత్రి
  • ఆరోగ్యశ్రీ ని బలోపేతం చేయడానికి, లీకేజీలు అరికట్టదానికి కమిటీ వేసి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి
ఇల్లు కట్టుకున్నా, పెళ్లి చేసుకున్నా పెట్టె ఖర్చు ఒక అంచనా వేసుకొని చేస్తాం కానీ వైద్యం మీద పెట్టె ఖర్చు అనుకోకుండా వచ్చి మీద పడుతుంది. గుడిసెలో ఉండేవారికి అయినా, బంగ్లా లో ఉండే వారికి అయినా వైద్యానికి పెట్టె ఖర్చు ఒకటే. అనేక పేద కుటుంబాలు వైద్యంకి ఖర్చు పెట్టలేక నలిగిపోతున్నాయి. అలాంటి పేదవాడికి మనం అండగా ఉండాలి. ఆత్మహత్యలకు కారణాల్లో అనుకోకుండా మీద పడే వైద్య ఖర్చులు కూడా ఒకటి అని జయతీ ఘోష్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ బాధలను దూరం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుంది అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

వైద్యం కి డబ్బులు ఖర్చు కాకుండా ఉండాలంటే ప్రభుత్వ వైద్యం ను మెరుగుపరచడం ఒక్కటే మార్గం అని అన్నారు. ఆరోగ్య శ్రీ లాంటి సేవలు మెరుగుపరచడం ద్వారా పేదవాని జేబు నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా చూస్తామని అన్నారు. పాత పద్దతులను పక్కన పెట్టి ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా విధివిధానాలు తయారు చేయాలని అధికారులని మంత్రి ఆదేశించారు. పురోగమన పద్దతిలో, ప్రజాధారిత కోణంలో సంస్కరణలు తీసుకురావడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి నివేదిక అందజేయాలని అధికారులకు సూచించారు. ప్రజల ప్రేమను పొందడానికి ఇంకా ఏం చేయాలో తెలియజేయాలని కోరారు.

లీకేజీలపై దృష్టి పెట్టాలని సూచించారు. చీట్ చేసే హాస్పిటళ్ల మీద ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ప్రజాధనం వృధా కాకుండా చూడాలని కోరారు. వివిధ జబ్బులకు చెల్లిస్తున్న డబ్బులు, చికిత్స విధానాలను..  ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా క్రమబద్దీకరణ చేయాలని కోరారు. ఆరోగ్య శ్రీ జాబితాలో ఉన్న ఏదైనా ప్రైవేట్  హాస్పిటల్ చికిత్స అందించడానికి నిరాకరిస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు. అటువంటి ఆసుపత్రులమీద ఫిర్యాదు చేయడానికి 104 కి ఫోన్ చేయాలని ప్రజలకు మంత్రి సూచించారు. ఆరోగ్య శ్రీ వార్డ్  అంటూ విభజన చేయకుండా అందరు  పేషంట్లతో పాటుగా చికిత్స అందిచేలా చూడాలని అధికారులను కోరారు.

ఆరోగ్య శ్రీ హాస్పిటల్ జాబితా లో చేరడానికి అప్లై  చేసుకున్న ప్రైవేట్ హాస్పిటల్ కి అనుమతి ఇవ్వాలని ఈ రోజు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే నాణ్యతా నిభందనలు అన్నీ పరిశీలించిన తరువాతనే అనుమతి ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ఒక పేషంట్ ఆరోగ్య శ్రీ కింద చేరితే ఇంటికి వెళ్ళేంత  వరకు పూర్తి ఉచితంగా చికిత్స అందించాలే తప్ప మంచి పరికరాలు వేస్తామని, మంచి రూమ్ ఇస్తామని కారణాలు చెప్పి హాస్పిటల్స్  డబ్బులు వసూలు చేయకుండా చూడాలని మంత్రి సూచించారు. ఇలాంటి వాటిని అరికట్టడానికి విజిలెన్స్ టీం లు ఏర్పాటు చేయాలని సూచించారు. చికిత్స పొందిన వారి ఫీడ్ బ్యాక్ తీసుకొని అవసరం అయితే హాస్పిటల్ ని ఆరోగ్య శ్రీ జాబితా నుండి తొలగించాలని సూచించారు.

ఆరోగ్య శ్రీ లో పని చేస్తున్న సిబ్బంది సంఖ్య పెంచాలని కూడా మంత్రి ఆదేశించారు. చికిత్స కి అనుమతి ఇవ్వడానికి అవసరం అయిన ప్యానల్ డాక్టర్ల సంఖ్య పెంచడానికి అనుమతి ఇచ్చారు. ప్రైవేట్ హాస్పిటల్ లో పేషంట్ల సహాయం కోసం ఏర్పాటు చేసిన  ఆరోగ్యమిత్ర ల పనితీరుపై కూడా మంత్రి సమీక్షించారు. పని భారం కి అనుగుణంగా వారి సంఖ్యను క్రమబద్దీకరణ చేయాలని సూచించారు. ఒక మిత్ర ఒక హాస్పిటల్ లో ఒక సంవత్సర కాలం పాటు పనిచేసేలా చూడాలని కోరారు. వారికి ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు.

పేదలకు నాణ్యమైన ఉచిత కార్పొరేట్ వైద్యం అందించడం ఆరోగ్య శ్రీ లక్ష్యం..  ఆ తృప్తి ప్రజలకు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆరోగ్య ట్రస్ట్ అధికారులతో జరిగిన సుధీర్గ సమీక్ష సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రభత్వ ఆసుపత్రులను కూడా కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్ది ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళే అవసరం లేకుండా చెస్తామన్నారు. గతంలో ఆరోగ్య శ్రీ బకాయీలు  వేల కోట్లలో ఉండేవని కానే ఇప్పుడు కేవలం 199 కోట్లు మాత్రమే ఉన్నాయని వాటిని కూడా అతి త్వరలో చెల్లిస్తామని తెలిపారు.

ఉద్యోగులు, జర్నలిస్ట్ ల హెల్త్ కార్డ్స్ ఉన్నవారికి అన్ని ఆసుపత్రుల్లో అన్ని వైద్య సేవలు అందేలా చూస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ కంటే తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరోగ్య శ్రీ పథకం 100 రెట్లు మెరుగైనదని అన్నారు. దానిలో లేని  517 చికిత్సా విధానాలు మన ఆరోగ్య శ్రీ లో ఉన్నాయని అందులో 434 చికిత్సలు అతి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవని అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య ట్రస్ట్ అధికారులు పాల్గొన్నారు.

More Press News