చిరునవ్వులతో నిండిన స్కూలు బ్యాగులు

బాల్యం అందరి జీవితంలో ఎంతో విలువైన సమయం. ఆ సమయంలో అతి ముఖ్యమైన భాగం పాఠశాల. మనలో అందరికీ చిన్నప్పటి పాఠశాల, క్లాసురూములకు సంబంధించి ఎన్నో మధురానుభూతులు ఉంటాయి. దురదృష్టవశాత్తు, చాలా మంది పిల్లలకు, విద్య ఇప్పటికీ ఒక ప్రత్యేక హక్కుగా పరిగణించబడుతుంది. ఈ పిల్లలకి స్కూలుకి వెళ్ళడానికి అవసరమైన వస్తువులు కూడా ఉండవు. కొంత మంది కేవలం పెన్సిలు, ఒక పుస్తకంతో మాత్రమే సంవత్సరం గడుపుతారు. ఈ COVID19 మహమ్మారి వల్ల ఇటువంటి పిల్లలు, ముఖ్యంగా వలస కార్మికుల పిల్లలు మరింత కష్టంలో పడ్డారు. ఒక విద్యా సంవత్సరం గడపడానికి కావలసిన కనీస అవసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నారు.

యూత్ ఫర్ సేవా (YFS) అనేది పిల్లలు చదువుకోవలని, కొత్త విషయాలు నేర్చుకోవాలనే విషయంపై పని చేస్తారు. వారు పిల్లలు చదువును ఒక బహుమతిలా భావించాలని, మన దేశంలో పాఠశాలలో అందించే విద్య యొక్క నాణ్యత మెరుగుపరచాలని, పేద విద్యార్థులకు విద్య అందాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. YFS వారు స్కూలు వదిలేసే వారి సంఖ్య తగ్గించాలని, స్కూలు పిల్లలకు ఒక "స్కూల్ కిట్" ను బహుమతిగా ఇయ్యడం వల్ల పిల్లలు స్కూలు మానకుండా ఉంటారని, పిల్లలు వారి విలువను తెలుసుకుంటారు.

YFS వారు మిలాప్ లో క్రౌడ్ ఫండింగ్ కాంపైన్ మొదలుపెట్టారు. మిలాప్ దక్షిణ ఆసియాలోనే అతి పెద్ద క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫాం. ఈ కాంపైన్ ద్వారా సేకరించిన నిధులతో YFS వారు ప్రభుత్వ పాఠశాలలకు, అనాధాశ్రమాలకు చెందిన 1000 మంది పిల్లలకు స్కూలు కిట్లు అందించాలని ఆశిస్తున్నారు. ఈ కాంపైన్ కి ఇప్పటికే ఎంతో సహాయం లభించింది. 150 మంది మద్దతుతో ఇప్పటికి సుమారు 2.3 లక్షల రూపాయలు సేకరించారు.

YFS ప్రతినిధి అశ్విన్ మాట్లాడుతూ “భారతదేశ జనాభాలో 40% మంది 18 సంవత్సరాల కంటే తక్కువ వయసుగల వారు; పిల్లలు. వీరిలో సగం కంటే తక్కువ పిల్లలు పాఠశాలకు వెళ్ళగలుగుతారు. వీరిలో 1/3 మంది మాత్రమే 8వ తరగతి దాటి చదవగలుగుతారు.  ఎంతో మంది పిల్లలు స్కూలు వదిలేయటం మాములు విషయం. వీరు స్కూలు వదిలేయటానికి కారణం పేదరికం, స్కూలుకు కావలసిన సామాన్లు లేకపోవడం, తల్లితండ్రులకు విద్య యొక్క ప్రాముఖ్యత అర్ధం కాకపోవడం."

ఈ విషయంపై మరింత మాట్లాడుతూ, " ఈ సమస్యను పరిష్కరించడానికి, YFS వారు 'స్కూల్ కిట్ స్పాన్సర్షిప్' కార్యక్రమాన్ని కల్పించారు. దీని ద్వారా కొన్ని రాష్ట్రాలలో ఉన్న నలుమూలల గ్రామాలలో కూడా స్కూలు పిల్లలకు అత్యవసర సామాన్లు అందిస్తారు. దాతల సహాయంతో, పిల్లలు చదువు కొనసాగించేలా చూస్తాము. మా ఈ ప్రయాణంలో మిలాప్ వారు క్రౌడ్ ఫండింగ్ లో ఎంతో సహాయం అందించారు." 

More Press News