వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ పై మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆలోచనల కనుగుణంగా రాష్ట్ర క్రయ విక్రయాల దస్తావేజులు, రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా, సులువుగా అవినీతికి తావు లేకుండా ఎటువంటి Human Interference లేకుండా, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చే విధంగా ధరణి పోర్టల్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారని రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి, క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ పై మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. 100 రోజుల విరామం అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, అధికారుల బృందం అవిశ్రాంతంగా శ్రమించి మంచి పోర్టల్ ను ప్రారంభించారని నిన్నటి నుంచే రిజిస్ట్రేషన్ ల ప్రక్రియ ప్రారంభమయ్యిందని తెలుపుతూ మొదట కొన్ని చిన్నచిన్న సమస్యలు వస్తాయని త్వరలోనే వీటి అన్నింటిని అధిగమించి ముందుకు వెళ్తామని అన్నారు.

ప్రజలకు రియల్ ఎస్టేట్ వారికి రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ఉన్న అపోహలు తొలగించి, అవగాహన కల్పిస్తామని ప్రజలకు అత్యంత వేగంగా, సులువుగా రిజిస్ట్రేషన్లు అయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అన్ని వర్గాల వారి నుండి వచ్చిన సలహాలు, సూచనల ఆధారంగా ప్రజలకు సౌకర్యవంతంగా రిజిస్ట్రేషన్ లు జరగాలని ముఖ్యమంత్రి క్యాబినెట్ సబ్ కమిటీని నియమించారని, సబ్ కమిటీ ఈ రోజు ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అధికారులతో సమావేశమై ప్రజలు, బ్యాంకర్లు, కొనుగోలు దారులు, అమ్మకందారులు, వివిధ వర్గాల నుండి వచ్చిన సూచనలు, సలహాలను క్రోడీకరించి సమర్పించామని అన్నారు.

ఆగిన రిజిస్ట్రేషన్ ల బ్యాక్ లాగ్ లను పూర్తి చేయడానికి పని ఆధారంగా ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాలలో అదనపు ఉద్యోగులను నియమించి 3 నెలలలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. సేల్ డీడ్ లపై ఉన్న అపోహలను తొలగిస్తామన్నారు. కొనుగోలు దారులు, అమ్మకందారులు తమకు సంబంధించిన స్వంత డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ లో డాక్యుమెంటేషన్ చేసుకోవచ్చు. స్టేక్ హోల్డర్లతో ఈ నెల 17 తేదిన HRD లో వర్క్ షాపు నిర్వహిస్తామని అన్నారు.

GPA, DGPA, SPA ప్రొవిజన్లను అందుబాటులోకి తెస్తామన్నారు. స్టాటుటరీ, ఆపరేషనల్ సిస్టం, సాంకేతిక సమస్యలపై అధికారులతో మూడు వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు కూడా భాగస్వాములై తగు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరామన్నారు. గత 100 రోజుల నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో అధికారుల బృందం  24 గంటలు పని చేస్తున్నారని మంత్రులు అందులో పాలు పంచుకొని వర్కింగ్ గ్రూపులుగా ముందుకు వెళ్తామన్నారు.

ఎటువంటి ట్యాంపరింగ్ ఫోర్జరీకి అవకాశం లేకుండా ప్రతి ఆస్తికి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇవ్వాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల కనుగుణంగా తెలంగాణ ప్రాపర్టి ఇండెక్స్ నెంబర్ స్ధానిక సంస్ధల ద్వారా ఇస్తున్నామని మంత్రి తెలిపారు.

ఈ పత్రికా సమావేశంలో హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ ఆలి, పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. 

More Press News