సమర్ధవంతంగా బాలల హక్కులను పరిరక్షించాలి: మంత్రి సత్యవతి రాథోడ్

  • బాలల హక్కులపై అవగాహన కల్పించాలి
  • హక్కులను ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు పడేలా చూడాలి
  • రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్, జనవరి 07: బాలల హక్కుల పరిరక్షణలో కమిషన్ సమర్థవంతంగా పని చేస్తోందని, ఈ రాష్ట్రంలో బాలల హక్కులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు పడేలా కమిషన్ చూస్తోందని తెలంగాణ రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి–శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నూతన కార్యాలయాన్ని నేడు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ పరిధిలో మంత్రి ప్రారంభించారు.

బాలల హక్కుల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పించాలని..  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు పని చేయాలని మంత్రి సూచించారు. తెలిసి తెలియని వయసు నుంచే బాలబాలికల పట్ల అనేక దురాఘతాలు జరుగుతున్నాయని, వీటిని నివారించేందుకు ఈ ఘటనలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు వేయడానికి ఈ కమిషన్ పని చేస్తోంది. అంతే కాకుండా బాలల హక్కుల రక్షణలో గ్రామాల్లో కూడా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నారు. మహిళా కమిషన్ కూడా ఏర్పాటు కావడంతో త్వరలో మహిళల హక్కులను కాపాడడంలో ఆ కమిషన్ సమర్థవంతంగా పని చేస్తుంది. ఈ రెండు కమిషన్లు రాష్ట్రంలో మహిళలు, బాలల హక్కులను కాపాడుతూ దోషులను కఠినంగా శిక్షిస్తాయి.

ఈ రాష్ట్రంలో ఇప్పటికే తాము చాలా ప్రాంతాల్లో బాలల హక్కులను కాపాడడంలో చాలా చురుకుగా పని చేశామని కమిషన్ చైర్మన్ జే. శ్రీనివాసరావు తెలిపారు. ఎక్కడ బాలల హక్కులు ఉల్లంఘనకు గురి అయినా అక్కడకు కమిషన్ చేరుకుని బాధితుల పక్షానా నిలబడుతోందని, న్యాయం చేస్తోందన్నారు. ఇంకా మరింత పటిష్టంగా పని చేస్తామని, హక్కులపై గ్రామాల్లో కూడా అవగాహన కల్పిస్తామని తెలిపారు.

అనంతరం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ లో రసాయనాలు లేకుండా పండించే ఆకుకూరలు, కూరగాయల విత్తనాలను మంత్రి, కమిషన్ సభ్యులు, అధికారులు చల్లారు. మొక్కలు పెట్టారు.

ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు బృందాదర్, అంజన్ రావు, దేవయ్య, శోభారాణి, అపర్ణ, రాగజ్యోతి, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య, బాల నేరస్తుల శాఖ సంచాలకులు శైలజా, కమిషన్ కార్యదర్శి ఆశ్రిత, శాఖ ఇతర అధికారులు పాల్గొన్నారు. 

More Press News