రోటరీ నగర్‌ను సుందరంగా తీర్చిదిద్దుతాం: ఏపీ మంత్రి వెల్లంపల్లి
- తక్షణమే రహదారిపై మురుగునీరు తొలగించాలని అదేశించిన మంత్రి
- మోటర్లు ద్వారా మురుగునీరు తొలగింపు చర్యలు చేపట్టిన అధికారులు
- అర్హలైన అందరికీ సంక్షేమ పథకాలు
రోటరీనగర్, బృందన్ కాలనీ ఈ ప్రాంతంలో మురుగునీరు రహదారిపై రావడం, పందులు సైరవీహరం చేస్తున్నాయని ప్రజలు మంత్రికి సమస్యను వివరించారు. దీంతో స్పందించిన మంత్రి తక్షణమే మోటార్లు పెట్టి మురుగునీరు తోడించాలని ఆదేశించారు. అదే విధంగా ఇరిగేషన్ అధికారులకు ఫోన్లో మట్లాడుతూ పైవోవర్ల దిగువ డైవర్షన్ చానల్స్ సీల్ తోలగించాలని ఆదేశించారు. ఈ ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న శిధిలమైన సోషల్ వెల్ప్‌ర్ డిపార్టుమెంట్ ఎస్సీ హస్టల్ పై నిర్ణయం తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అదే విధంగా ఈ ప్రాంతంలో హైటేన్షన్ కరెంట్ వైర్లు ఉన్న కారణంగా విద్యుత్ సమస్యలు, ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశించారు.