మహబుబ్ నగర్ కు న్యూ ఎనర్జీ పార్క్

మహబుబ్ నగర్ లోని న్యూ ఎనర్జీ పార్క్ ను భారతదేశంలోనే మెుట్టమెుదటి లిధియం - ఆయాన్ సెల్ మ్యానిప్యాక్చరింగ్ కోరకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా మంత్రి మహబుబ్ నగర్ జిల్లా ప్రజల తరుపున రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి, రాష్ట్ర పురపాలక, పరిశ్రమల, ఐటి శాఖల మంత్రి కేటీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు.

మహబుబ్ నగర్ లోని దివిటిపల్లిలో మంత్రి కేటీఆర్ సుమారు 400 ఎకరాలలో ప్రతిష్టాత్మకంగా ఐటి మరియు మల్టిపర్పస్ టవర్ నిర్మాణం పనులను ప్రారంబించారు. ఐటి మరియు మల్టిపర్పస్ టవర్ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 3 ప్లోర్ నిర్మాణం జరుగుతున్నాయి. అదేవిధంగా అదనంగా రెండు ప్లోర్ల నిర్మాణం కోసం రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి మేరకు 40 కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు కేటాయించారు.

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబుబ్ నగర్ జిల్లా ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వానికి చేసిన విజ్టప్తి మేరకు రాష్ట్ర పురపాలక, పరిశ్రమల, ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు దేశంలో మెుట్టమెుదటి సారిగా న్యూ ఎనర్జీ పార్క్ ను కేటాయించారు. ఈ న్యూ ఎనర్జీ పార్క్ లో భాగంగా చార్జీ X0 మరియు గ్రీన్ కో కంపనీలు భారత దేశంలోనే మెుట్టమెుదటి లిధియం - ఆయాన్ సెల్ మ్యానిప్యాక్చరింగ్ కోరకు సుమారు 100 ఎకరాలలో రెండు వేల కోట్ల రూపాయలను పెట్టుబడిని పెడుతున్నాయి. ఈ పెట్టుబడుల మహబుబ్ నగర్ జిల్లాలో సుమారు పత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లబిస్థాయన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మరో 4, 5 పెద్ద కంపనీలు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పేట్టడానికి సిద్దంగా ఉన్నాయన్నారు.

మహబుబ్ నగర్ లోని దివిటిపల్లిలో మిగిలిన 300 ఏకరాలలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఐటి మరియు మల్టిపర్పస్ టవర్ పనులు ఇప్పటికే 3వ ప్లోర్ పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ న్యూ ఎనర్జీ పార్క్ లో ఎలక్ట్రానిక్ వాహనాలు, అనుబంద రంగాలకు సంబందించిన బ్యాటరీ వాహనాలు, లిథియం ఆయాన్ బ్యాటరీ ప్యాక్ లు, పోటోవాల్టిక్ సెల్ లు బ్యాటరీలు గిగా ప్యాక్టరీలు తయారు చేసే కంపనీలు ఈ పార్క్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయన్నారు.

మహబుబ్ నగర్ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ది చేయటంతో పాటు జిల్లాకు చెందిన యువతి, యువకులకు ఉద్యోగ, ఉపాది అవకాశాలను అందించాలనే లక్ష్యంతో వేల కోట్లతో పెట్టుబడులను జిల్లాకు తీసుకవస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మంత్రి కేటీఆర్ సహకారంతో మహబుబ్ నగర్ జిల్లా సమగ్ర అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్ కు, అంతర్జాతీయ విమానాశ్రయంకు అతి సమీపంలో ఉన్న మహబుబ్ నగర్ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ది చేస్తున్నామని అన్నారు.

More Press News