అధికారులతో మంత్రి మల్లా రెడ్డి సమీక్ష

హైదరాబాద్: ఈ రోజు (12.04.2021) కార్మిక శాఖ మంత్రి సిహెచ్. మల్లా రెడ్డి అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డు అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఐ.రాణి కుముదిని దేవి, తెలంగాణ బిల్డింగ్ మరియు కన్స్స్ట్రక్షన్ బోర్డు సెక్రెటరీ & ముఖ్య కార్య నిర్వహణ అధికారి శ్యామ్ సుందర్ రెడ్డి మరియు తెలంగాణ అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డు పాలనా అధికారి డా. ఈ. గంగాధర్ మొదలగు అధికారులతో తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
 
కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా విస్తరిస్తున్న సందర్భంగా అన్నీ పరిశ్రమలలో, షాపులలో, నిర్మాణ రంగంలో ఉన్న అసంఘటిత కార్మికులకు కార్మిక శాఖ తరపున RTPCR మరియు వాక్సినేషన్ పై సరైన అవగాహన కల్పించాలని ఆదేశించారు.
 
కార్మిక సంక్షేమ మండలి ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలు, దాని ఫలితాలను ప్రస్తావించడం జరిగినది. ఇందులో భాగంగా ఇంత వరకు ఎంత మంది లబ్ది పొందారొ మరియు వారికి అవగాహన కల్పించే అంశాలు ఏమేమి చేపట్టారో, అలాగే కన్స్స్ట్రక్షన్ బోర్డులో ఎంత మందిని ప్రతి సంవత్సరం కొత్తగా గుర్తిస్తున్నారో, ఎన్ని పథకాలల్లో లబ్ది పొందారో పూర్తి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించడమైనది.
 
కేంద్రం నుండి వచ్చే ఉత్తర్వులు ఆలస్యంగా వస్తున్న సందర్భంగా మంత్రి కోవిడ్ ఉధృతిని దృష్టిలో ఉంచుకుని ఒక యాప్ ని మిగతా అన్నీ రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసి దాని ద్వారా అసంఘటిత కార్మికులను గుర్తించి వారికి అవగాహనా సదస్సులను ఏర్పాటు చేయాలని, అన్నీ శాఖల అధికారులను సమన్వయం చేయాలని తెలంగాణ అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డు పాలనా అధికారిని ఆదేశించారు.

అన్ని రంగాలలో అధికంగా అసంఘటిత కార్మికులే ఉండడం చేత వారే ఎక్కువగా కరోనా బారిన పడుతుండడం వలన వారికి మాస్క్ లు, షానిటైజర్, RTPCR టెస్టులు మరియు వాక్సినేషన్ సంబంధిత యాజమానుల నుండి పొందేలా సమన్వయం చేయాలని సూచించారు.

అసంఘటిత కార్మికుల కొరకు క్యాలెండర్ ను తయారు చేయాలని వారి సంక్షేమం కొరకు అన్నీ చర్యలు చేపట్టడం కొరకు త్వరలో జిల్లా నోడల్ అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని స్పెషల్ చీఫ్ సెక్రెటరీని ఆదేశించారు.
 
కార్మిక శాఖకు సంబంధించిన అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డు, తెలంగాణ బిల్డింగ్ మరియు కన్స్స్ట్రక్షన్ బోర్డు యొక్క అన్ని సంక్షేమ పథకాలు, వాటి పని తీరుపై చర్చించేందుకు సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.   

More Press News