ఈ నెల 15 నుంచి విద్యార్థుల‌కు ఆన్‌లైన్ క్లాసులు: విజయవాడ న‌గర పాలక సంస్థ అదనపు క‌మిష‌న‌ర్

  • 7 నుంచి 10వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఆన్‌లైన్ క్లాసులు
విజయవాడ: కరోనా వైరస్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో విద్యార్థుల యొక్క చదువులకు అవరోధం కలుగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆదేశాల మేర‌కు న‌గ‌ర పాలక సంస్థ స్కూల్ లో 7 నుంచి 10వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఈ నెల 15 నుంచి విద్యార్థుల‌కు ఆన్ లైన్ తరగతులు నిర్వ‌హిస్తున్న‌ట్లు అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ తెలిపారు.

మంగ‌ళ‌వారం సత్యనారాయణపురం ఏ.కే.టి.పి.యం హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన అవగహన కార్యక్రమములో అదనపు క‌మిష‌న‌ర్ డా.జె.అరుణ పాల్గొని విద్యార్ధుల తల్లిదండ్రులకు అవగహన కల్పించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 29 హైస్కూల్స్ మరియు 4 అప్పర్ ప్రైమరి స్కూల్స్ నందు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్ధులకు ఆన్ లైన్ తరగతులు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.

చిన్నారులకు ఫోన్ మరియు నెట్ కనెక్షన్ అందుబాటులో ఉండేలా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు. 15వ తేది నుంచి దూరదర్శన్ ద్వారా కూడా క్లాసులు నిర్వహించే ఏర్పాట్లు  జరిగిందని, ఫోన్ అందుబాటులో లేని వారు దూరదర్శన్ నందు వచ్చు తరగతులను సద్వినియోగం చేసుకోవాల‌న్నారు. అదే విధంగా ఆన్‌లైన్‌ క్లాస్‌ల‌కు సంబందించి ప్ర‌తి స్కూల్ నుంచి ఒక మొబైల్ నెంబరు విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని, ఆ నెంబరుకు ఫోన్ చేసి విద్యార్థులు వారి సందేహాలను నివృతి చేసేకోవ‌చ్చని అన్నారు.

ఈ కార్యక్రమములో డిప్యూటీ ఎడ్యుకేషన్ అధికారి రామలింగేశ్వరరావు, స్కూల్స్ సూపర్ వైజర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది, పేరెంట్స్ కమిటి మెంబర్లు మరియు విద్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 

More Press News