జనసేన పార్టీ కొత్త ప్రధాన అధికార ప్రతినిధులు వీరే!

  • ముగ్గురు ప్రధాన అధికార ప్రతినిధులు

  • మరో ఐదుగురు అధికార ప్రతినిధులు

  • నియమించిన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్

జనసేన పార్టీకి ముగ్గురు ప్రధాన అధికార ప్రతినిధులను, మరో ఐదుగురు అధికార ప్రతినిధులను పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నియమించారు. ప్రధాన అధికార ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, సీనియర్ రాజకీయ నాయకుడు బొలిశెట్టి సత్య, ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా పనిచేసి జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న టి. శివశంకర్ లను నియమించారు.

స్పీకర్ ప్యానల్ ప్రతినిధులుగా పోతిన వెంకట మహేష్, మనుక్రాంత్ రెడ్డి, అక్కల రామ్మోహన్ రావు(గాంధీ), డాక్టర్ పి. గౌతమ్ కుమార్, కూసంపూడి శ్రీనివాస్ లను ఎంపిక చేశారు. అధికార ప్రతినిధుల్లో కూసంపూడి శ్రీనివాస్ మినహా మిగిలిన నలుగురు సభ్యులు గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్ధులుగా పోటీ చేశారు. కొత్తగా నియామకం అయిన సభ్యులు నిన్న సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అంతా ఒకే మాటతో ముందుకు వెళ్లాలని, భిన్నాభిప్రాయాలకు తావివ్వరాదని పవన్ కల్యాణ్ వారికి సూచించారు.


More Press News