ఈ నెల 11న బీసీ స్టడీ సర్కిల్ లో సివిల్స్-2022 స్క్రీనింగ్ టెస్ట్

  • 7వ తేదీ నుంచి హల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు
  • 11న ఉదయం 9 నుంచి 11 వరకు మొదటి షిఫ్ట్
  • మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు రెండో షిఫ్ట్
  • 3064 మంది అభ్యర్థులకు పరీక్ష
  • 1/3 నెగెటివ్ మార్కులు
హైదరాబాద్: బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ -2022 కోచింగ్ కోసం ఈ నెల 11న స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఈ పరీక్షకు 3064 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. 11న ఉదయం 9 నుంచి 11 వరకు మొదటి విడతగా, మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు రెండో విడతగా పరీక్ష నిర్వహిస్తామని ఆయన తెలిపారు.‌ పరీక్ష సమయం 2 గంటలు. మొత్తం వంద ప్రశ్నలు ఉంటాయన్నారు. 200 మార్కుల ఈ పరీక్ష ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ లో ఉంటుందని, తప్పుగా జవాబు రాసిన ప్రశ్నకు 1/3 నెగటివ్ మార్క్ ఉందన్నారు.‌ పరీక్షా కేంద్రాల్లో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కోవిడ్ నిబంధనలు చాలా కచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు.

More Press News