ఆధ్యాత్మిక హబ్ గా ముచ్చింతల ఆశ్రమం: మంత్రి జగదీష్ రెడ్డి

  • జాతిని ఆకర్షించనున్న శ్రీరామనుజుల స్వామి విగ్రహం
  • విగ్రహఆవిష్కరణకు నిరంతర విద్యుత్ సరఫరా
  • రెప్పపాటు అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు
  • యజ్ఞాశాల, భోజనశాలలలో విద్యుత్ ఏర్పాట్లు
  • యాగం కొరకు ప్రత్యేక సిబ్బంది నియామకం
  • 33/11 కేవీ సబ్ స్టేషన్, 28 ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు
  • ఆలయ ప్రాంగణంలో మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలన
  • ముచ్చింతల్ లోశ్రీ రామనుజుల వారి విగ్రహ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జగదీష్ రెడ్డి
  • శ్రీశ్రీశ్రీ త్రిదండిరామానుజ జీయర్ స్వామితో ఏర్పాట్లపై సమీక్ష
ముచ్చింతల్ లోని శ్రీశ్రీశ్రీ త్రిదండీ చినజీయర్ స్వామి వారి ట్రస్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ రామనుజుల స్వామి వారి విగ్రహం యావత్ భారత దేశాన్ని ఆకర్షించే విదంగా రూపుదిద్దుకుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తద్వారా ఈ ప్రాంతం ఆధ్యాత్మిక హబ్ గా మారనుందని ఆయన చెప్పారు. స్వామి వారి ట్రస్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీ రామనుజుల స్వామి వారి విగ్రహాన్నిఆవిష్కరించేందుకుగాను జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం మంత్రి జగదీష్ రెడ్డి టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, జగత్ రెడ్డిలతో కలసి సందర్శించారు.

ఫిబ్రవరి 2 నుండి 14 వరకు జరుగు కార్యక్రమలపై శ్రీశ్రీశ్రీ త్రిదండీ చినజీయర్ స్వామి వారితో కలిసి ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రధానితో పాటు ముఖ్యమంత్రులు, గవర్నర్లు వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున అధికారులు, అనాధికారులు తరలి రానున్నందున విద్యుత్ ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యుత్ ప్రసారంలో రెప్పపాటు అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలోనీ యజ్ఞశాల, బోజనాదిశాలలలో ఏర్పాట్లు చేసిన విద్యుత్ ఏర్పాట్లను ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు. పదిరోజుల పాటు జరగనున్న ఈ మహోత్సవంలో నిరంతరం విద్యుత్ సరఫరాను సమీక్షించేందుకు ప్రత్యేక విద్యుత్ సిబ్బందిని నియమించినట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ విగ్రహా ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. అందులో బాగంగా విద్యుత్ ప్రసారాలు నిరంతరాయంగ ఉండేలా చూడడంతో పాటు ఎటువంటి అంతరాయం కలుగకుండా చూడాలని సమీక్షలో పాల్గొన్న అధికారులకు ఆయన సూచించారు. ఇప్పటికే 33/11కేవీ సబ్ స్టేషన్ 28 ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా వివరించారు.

మొత్తం 10 రోజులు జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నలుమూలల నుండి తరలివస్తున్న ప్రముఖులు, ఆధ్యాత్మిక రంగంలో నిష్ణాతులు వివిధ రంగాల నుండి తరలివస్తున్న వారికి విద్యుత్ పరంగా ఎటువంటి ఆటంకాలు కలుగకుండా ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఆశ్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి కలియ తిరిగి ఏర్పాట్లు పరిశీలించారు. మంత్రి జగదీష్ రెడ్డి వెంట టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, జగత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

More Press News