టీ-శాట్ మాక్ టెస్ట్ తో పోటీ పరీక్షల అభ్యర్థుల మెదడుకు మేధస్సు: సీఈవో శైలేష్ రెడ్డి
- పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సదవకాశం
- 24/7 అందుబాటులో మాక్ టెస్ట్ జానర్
- 150 ప్రశ్నలకు రెండున్నర గంటల సమయం
టీ-శాట్ మాక్ టెస్ట్ జానర్ 24 గంటలూ అందుబాటులో ఉంటుందని, తమ భవిష్యత్ తామే నిర్ణయించుకునే అవకాశం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. టెట్, పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు సంబంధించిన సబ్జెక్టుల్లో 150 ప్రశ్నలతో జానర్ లో అందుబాటులో ఉంటుందన్నారు. 2.30 గంటల సమయంలో 150 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని, సమయం పూర్తయ్యాక యాప్ దానంతటదే మూసివేయబడి, అభ్యర్థి పూర్తి చేసిన ప్రశ్నలకు వెంటనే మార్కులు ప్రకటించబడతాయన్నారు.
ఫలితంగా అభ్యర్థి ప్రశ్నపత్రాన్ని ఏ మేరకు పూర్తి చేయగలడో స్పష్టం అవుతుందన్నారు. అధునాతన టెక్నాలజీ సహాయంతో టీ-శాట్ ప్రత్యేకంగా నిర్విహించే మాక్ టెస్ట్ ద్వార అభ్యర్థులు ప్రధాన పరీక్షలో మంచి విజయం సాధించేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఆయా ఉద్యోగాలకు సంబంధించిన సబ్జెక్టుల్లో సుమారు 25,000 ప్రశ్నలను క్రోడీకరించగా 8000 మంది అభ్యర్థులు మాక్ టెస్ట్ జానర్ లో నమోదు చేసుకున్నారన్నారు.
మాక్ టెస్ట్ లో ఎలా పాల్గొనాలంటే..:
మాక్ టెస్ట్ లో పాల్గొనే అభ్యర్థి ‘టీ-శాట్ యాప్ tsat.tv లోకి ప్రవేశించాక మాక్ టెస్ట్ క్లిక్ చేసి టెట్, పోలీసు కానిస్టేబుల్, పోలీసు ఎస్స్రై అప్షన్లలో తాము రాయబోయే పరీక్షను ఎంచుకుని అందులో పేరు, విద్యార్హత, ఈమేయిల్, ఫోన్ నెంబర్ నమోదు చేశాక జానర్ లో కనిపించే 150 ప్రశ్నలకు ఒక్కొక్కటిగా సమాధానాలు గుర్తించి 2.30 గంటల సమయం పూర్తయ్యాక తాము సాధించిన మార్కులు తెరపై కన్పిస్తాయి’ అని సీఈవో శైలేష్ రెడ్డి వివరించారు. అభ్యర్థులు పడిన కష్టానికి మాక్ టెస్ట్ ద్వార ఫలితాన్ని అంచనా వేసుకునే అద్భుత అవకాశాన్ని టీ-శాట్ కల్పించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.