గిరిజన మహిళలపై దాడి ఘటన పట్ల రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునితా లక్ష్మారెడ్డి సీరియస్
ఘటనను సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్
బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశాలు
హైదరాబాద్: మంచిర్యాల జిల్లా కోయపోషగూడెంలో జరిగిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి విచారణకు ఆదేశించారు. గిరిజన మహిళలపై జరిగిన దాడిని చైర్ పర్సన్ ఖండించారు. ఈ ఘటనను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించిందని చైర్ పర్సన్ ప్రకటించారు. ఈ ఘటనపై వెంటనే సమగ్ర విచారణ చేసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు రామగుండం సీపీ, మంచిర్యాల డీసీపీలను మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆదేశించారు. ఆదివాసీ మహిళలకు రాష్ట్ర మహిళా కమిషన్ అండగా ఉంటుందని, వారికి ప్రభుత్వ పక్షాన న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.