ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి!
మాట ఇచ్చిన .. నీళ్లు తెచ్చిన : మంత్రి సింగిరెడ్డి
- వనపర్తి పట్టణానికి, సంస్థానకేంద్రానికి సాగునీటి కోసం ఆనాటి సంస్థానాధీషులు కట్టించిన చెరువు- సమైక్య రాష్ట్రంలో నిరాదరణకు గురై అన్యాక్రాంతమయింది
- 160 ఎకరాల చెరువు శిఖంలో దాదాపు 60 ఎకరాలలో అక్రమకట్టడాలు వెలిశాయి
- ఈ చెరువులో ప్రజలు నీళ్లు చూడక దశాబ్దాలు అయిపోయింది
- ఇక ఈ చెరువుకు కృష్ణా నీళ్లు చూస్తమా అన్న అపనమ్మకం ప్రజలకు ఉండేది
- కృష్ణా నీళ్లు తెస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకుని నల్లచెరువును అలుగుపారించినం
- వనపర్తి ప్రజల ఆకాంక్షను నెరవేేర్చడం జరిగింది- నల్లచెరువు నిండడంతో దీని కింద ఆయకట్టు భూములు సాగులోకి రావడమే కాకుండా వనపర్తి చుట్టూ నాలుగు కిలోమీటర్ల పరిధిలో బోర్లు రీఛార్జ్ అయ్యాయి
- పట్టణంలో మత్స్యకార కుటుంబాలు అధికంగా ఉన్నాయి .. వారికి జీవనోపాధి కరువయింది- నల్లచెరువు అలుగు పారుతుంది .. పట్టణం పరిధిలో ఉన్న తాళ్లచెరువు, ఈదుల చెరువుల పునరుద్దరణ కార్యక్రమం సాగుతుంది
- వచ్చే వానకాలానికి ఆ రెండు చెరువులు అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయించుకోవడం జరిగింది- ఈ మూడు చెరువులు నిండితే వీటిలోని మత్స్యసంపదతో మత్స్యకార కుటుంబాలకు సరిపడా ఉపాధి లభిస్తుంది
- పర్యాటకపరంగా, అహ్లాదకరంగానే కాకుండా మత్స్యకారులకు ఆర్థిక స్వావలంబన కలుగుతుంది- పట్టణానికి ఈశాన్యంలో ఉన్న చెరువు గతంలో కుళ్లిన కళేబరాలు, మురికితుమ్మ చెట్లు, మురుగునీళ్లతో అత్యంత దారుణంగా ఉండేది
- ఈ పరిసరాల వైపు ప్రజలు సంతరించడానికే ఇష్టపడేది కాదు- ఈ రోజు రోజుకు వెయ్యిమంది చెరువు కట్టను చూసి వెళ్లి అహ్లాదాన్ని ఆస్వాదిస్తున్నారు
- ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో వందలాది చెరువులను పునరుద్దరిస్తూ, నీటితో నింపుతూ పోతున్నాం- ఒక్కొక్క చెరువును నింపడాన్ని ఒక తపస్సులా భావిస్తూ పనిచేస్తున్నాం
- ఈ రోజు పట్టణ ప్రజలతో కలిసి నల్లచెరువు అలుగుకు పూజలు చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను- నల్లచెరువు అలుగెల్లిన సంధర్భంగా పూజలు చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.