సుస్థిర వ్యవసాయం దిశగా తెలంగాణ రాష్ట్రం....

• సుస్థిర వ్యవసాయం దిశగా తెలంగాణ రాష్ట్రం....
• తెలంగాణ ఏర్పడే నాటికి కరువు పరిస్థితులు, సాగు, తాగునీటికి ఇబ్బందులు, కరెంటు లేక రైతులు… బ్రతుకు దెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వలసల బాట పట్టే వారు....
• వ్యవసాయాన్ని ఉపాధిగా చూడలేని పరిస్థితులు ఉండేవి…
• అలాంటి పరిస్థితుల్లో ఆవిర్భవించిన మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అస్తిత్వం తెలిసిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొప్ప దార్శనికతతో వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేసి రైతు బాంధవుడు అయ్యారు.... ప్రోత్సహించకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందదని ఈ రంగంపై దృష్టిసారించారు.
• వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఈ రంగానికి అవసరమైన సదుపాయాల కల్పనపై దృష్టిసారించారు.
• మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలు పటిష్ట పరిచి నీటితో నింపడంతో భూగర్భజలాలు పెరిగాయి.
• ప్రపంచంలోనే ఒక అధ్బుతం కాళేశ్వరం ప్రాజెక్ట్ని ర్మాణం... పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశారు...
• రైతుబంధుతో పెట్టుబడి, రైతుభీమాతో భరోసా, రుణమాఫీ, సాగునీటి సదుపాయం, ఉచితంగా 24 గంటల కరంటు, అందుబాటులో విత్తనాలు , ఎరువులు ఉంచడం జరిగింది. దీంతో వ్యవసాయం పురోగతి చెంది 2 కోట్ల 10 లక్షల ఎకరాలు సాగులోకి రాగా ఈ ఏడాది వానాకాలంలో వరి సాగు ఆల్ టైమ్ రికార్డ్ సాధించి దేశానికి అన్నపూర్ణగా నిలిచింది.

మారిన వ్యవసాయ పరిస్థితులను గమనిస్తే 2001 లో ఎకరా భూమి రూ.15 వేల నుండి రూ.30 వేలు ఉండేది .. తెలంగాణ ఆవిర్భావ సమయంలో
రూ.2 లక్షల నుండి రూ.3 లక్షలు ఉండేది .. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యం మూలంగా
తెలంగాణ ఏ మూలకు వెళ్లినా ఎకరా ధర రూ.20 లక్షలకు తక్కువ లేదు. వ్యవసాయరంగానికి ప్రాధాన్యం ఇచ్చి జాతి సంపద పెంపుకు మన
ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారు. పర్యావరణం, వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయరంగాన్ని సుస్థిరం చేయాల్సిన అవసరం నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సాంకేతికను ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక వాతావరణ పరిస్థితులలోనే కాకుండా రోడ్డు, వాయు మార్గాలు కూడా సుస్థిర వ్యవసాయానికి సానుకూలంగా ఉన్నాయి. పంట సాగు నుండి కోత వరకు, కోత నుండి మార్కెటింగ్ వరకు అన్నింటా పరిష్కారాలు రైతులకు మార్గ దర్శనం చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారిదే...

రైతు బంధు పథకం ...దేశానికే ఆదర్శం.... ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి ఇప్పటివరకు, రైతుబందు పథకం ద్వారా రూ. 58,102 కోట్ల ఆర్ధిక సాయం అందించింది.... ఆనాడు అస్తిత్వం కోసం పోరాడిన తెలంగాణ.... నేడు అభ్యుదయ పథం లో దేశంలోనే అగ్రపధాన , అభివృద్ధి రాష్ట్రం గా నేడు అవతరించింది... రైతు సంక్షేమ రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు పొందుతున్నది. ఇప్పటివరకు రూ. 58,102 కోట్ల రూపాయల ఆర్ధిక సహాయం తో రైతు బంధు నిధులతో రాష్ట్ర రైతాంగానికి చేయూత నిచ్చింది. రైతాంగానికి మన ప్రభుత్వం ఇచ్చిన స్ఫూర్తికి ,కేంద్ర ప్రభుత్వం కూడా ఫసల్భీ మా యోజన పథకం ప్రారంభం చేసింది. రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటలు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తుంది. రాష్ట్రం తొలినాళ్ళలో 2014 లో స్థాపిత విద్యుత్ సామర్ధ్యం 7778 మెగావాట్లు ఉండగా, నేడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ తో 17 వేల 234 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ రోజంతా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నారు. నేడు తెలంగాణ రాష్ట్రం వెలుగు జిలుగులతో వెలిగి పోతోంది.ఆనాడు సమైక్య పాలకులు ఎన్నో అవాకులు , వెక్కిరింతలతో ఎగతాళి చేసిన సందర్భాలూ మనం చూశాం. 
    
ఇక సాగునీటి విషయంలో మన తెలంగాణ “ఆదికవి దాశరథి” చెప్పినట్లుగా “నా తెలంగాణ కోటి రత్నాల వీణ” గా “నా తెలంగాణ రాష్ట్రం కోటి ఎకరాల మాగాణి” గా రూపుదిద్దుకున్నది. ఈ వానా కాలం సీజన్లో రైతుబంధు ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం కొత్తగా 3.64 లక్షల రైతులు వానా కాలం సీజన్లో దరఖాస్తు చేసుకున్నారు. రైతులకు సకాలం లో ఆర్ధిక సాయం అందించాలనే సత్సం కల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు నిధులు తక్షణం విడుదల చేశారు. ఎకరాకు రూ.5 వేల చొప్పున విడతల వారీగా రూ.7,654.43 కోట్లను రైతులకు ప్రభుత్వం గత వానా కాలం పంటలకు చెల్లించింది. మొత్తం 68,94,486 మంది రైతులకు పెట్టుబడి సాయం అందింది. ఎకరాకు రూ.5 వేల చొప్పున విడతల వారీగా రూ.7,654.43 కోట్లను రైతులకు ప్రభుత్వం చెల్లించింది. రాష్ట్రంలోని 1.53 కోట్ల ఎకరాలకు రైతు బంధు అందింది. దాదాపు 1.50 లక్షల ఎకరాల భూమి కొత్తగా రైతుబంధు జాబితాలో చేరింది. యాసంగి సీజన్తో పోల్చితే 3.64 లక్షల మంది రైతులకు ఈ సారి కొత్తగా రైతుబంధు ఆర్థిక సాయం అందించారు. గత యాసంగి వరకు రైతుబంధు కింద రూ.50,448 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ సీజన్లో జమ చేసిన రూ.7,654.43 కోట్లను కలిపితే.. మొత్తంగా రైతుబంధు సాయం రూ. 58,102 కోట్లకు చేరింది. ఇప్పటివరకు దేశంలో ఏ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం చేసిన దాఖలాలు లేవు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు సృష్టించినా వాటన్నింటినీ దాటుకొని రైతుల కోసం సీఎం కేసీఆర్రై తుబంధు నిధులను మంజూరు చేశారు. రైతులపై సీఎం కేసీఆర్ కు గల ప్రేమకు ఇది నిదర్శనం. గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తి మరింత ప్రోత్సహించి,


రైతుల ఆదాయం పెంచేందుకు నగదు రూపంలో రుణాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే రైతు బంధు. రైతులు
ప్రైవేట్ అప్పుల ఊబిలో చిక్కుకుపోకుండా ఈ స్కీమ్కా పాడుతోంది. ఒక్కో ఎకరానికి, ఒక్కో రైతుకి ప్రతి సీజన్లో రూ.5000ను ప్రభుత్వం రైతుల అకౌంట్లోకి జమ చేస్తుంది. ప్రధానాంగా, అప్పుల ఊబిలో రైతులు చిక్కుకోకుండా రైతు బంధు సహాయ పడుతుంది. రైతులకు కావాల్సిన తొలి పెట్టుబడి బాధ్యతంతా ప్రభుత్వానిదే. తెలంగాణ రైతుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి స్కీమ్. రైతుల కోసం దేశంలోనే తీసుకొచ్చిన తొలి స్కీమ్ ఇదే, రైతుల ఆదాయం పెంచేందుకు నగదు రూపంలో రుణాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే రైతు బంధు. రైతులు ప్రైవేట్అ ప్పుల ఊబిలో చిక్కుకుపోకుండా ఈ స్కీమ్ కాపాడుతోంది. 2018-19 ఖరీఫ్ సీజన్ నుంచి రైతులకు కావాల్సిన తొలి పెట్టుబడిని ప్రభుత్వమే చూసుకుంటోంది. ఒక్కో ఎకరానికి, ఒక్కో రైతుకి ప్రతి సీజన్లో రూ.5000ను ప్రభుత్వం రైతుల అకౌంట్లోకి జమ చేస్తుంది. ఇలా రెండు పంటలుగా తీసుకుంటే ప్రజలకు రూ.10 వేలు ప్రభుత్వం నుంచి అందుతున్నాయి. విత్తనాలు, రసాయనాలు, ఎరువులను కొనుగోలు చేసుకునేందుకు, ఇతరాత్ర అవసరాలకు రైతుల చేతికి ఈ నగదును ప్రభుత్వం రైతు బంధు కింద ఇస్తోంది. రైతులకు మద్దతునిచ్చేందుకు దేశంలో ప్రవేశపెట్టిన తొలి పెట్టుబడి పథకం ఇదే కావడం విశేషం. రైతు బంధు కింద డబ్బులను తెలంగాణ ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లలోకే వేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని చిన్న,సన్నకారు రైతులను ఆదుకోవడానికి ప్రతి రైతుకి ఖరీఫ్, రబీ సీజన్లలో ఒక్కో ఎకరానికి రూ.5000, మొత్తంగా రూ.10 వేలు అందిస్తున్నారు. రైతు బంధు పథకాన్ని తొలిసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన రైతుల సమన్వయ కమిటీ(రైతు సమన్వయ సమితి) కాన్ఫరెన్స్లో ఫిబ్రవరి 25న, 2018లో ప్రకటించారు. ఆ తర్వాత 2018 మే 10న కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ నియోజకవర్గంలోని ధర్మరాజుపల్లి గ్రామంలో అధికారికంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.


 2018-19 బడ్జెట్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు బంధు పథకం కోసం రూ.12 వేల కోట్లను కేటాయించింది. అంతేకాక 2021 వరకు ఈ పథకం కింద రూ.50 వేల కోట్లను రైతు ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేసింది. కేవలం తొలి పెట్టుబడిని అందించడమే కాకుండా... ఈ పథకం కింద తెలంగాణ ప్రభుత్వం రుణాలను అందిస్తోంది. ఈ పథకం కింద తీసుకునే రుణాలకు కూడా రైతులు ఎలాంటి వడ్డీని చెల్లించాల్సినవసరం లేదు. 68 లక్షల మంది రైతులు ఈ పథకం కింద ప్రతి ఏడాది పెట్టుబడి సాయం పొందుతున్నారు. రాష్ట్రంలో కోటి 50 లక్షల 43 వేల 606 ఎకరాలకు పంట సాగు జరుగుతోంది. తెలంగాణలో సుమారు 55 శాతం మంది జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ పంట పెట్టుబడి పథకం వల్ల 90.5 శాతానికి పైగా పేద ప్రజలు ప్రయోజనం పొందుతున్నారు. అంతకుముందు రైతులకు పంట సాయం దొరకకపోతుండటంతో.. పెట్టుబడిదారులు, దళారుల నుంచి అప్పులు తెచ్చుకునేవారు. వారు రైతులపై అధిక వడ్డీలు విధించేవారు. ఈ వడ్డీలతో రైతులు అప్పులు పాలై, ఆత్మహత్యలు చేసుకునేవారు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ విదంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం గణనీయంగా అభివృద్ధి చెందింది. దేశంలో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు మార్గ దర్శనంగా ఉన్నది.
---------------------------------------------------------------------------------------------------------
కమీషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ చే జారీచేయనైనది

More Press News