హైదరాబాద్‌లో ప్రారంభమైన బూజీ ప్రీ పెయిడ్‌ పెగ్‌

కేవలం 10 నిమిషాలలో లిక్కర్‌ హోమ్‌ డెలివరీ మోడల్‌ ద్వారా తూర్పు భారతంలో  అశేష  ప్రజాదరణ పొందిన బూజీ ఖర్చు గురించి ఆలోచించే పబ్‌ గోయర్లను ఆకట్టుకోవడం కోసం హైదరాబాద్‌లో తమ డిస్కౌంటెడ్‌ ప్రీ పెయిడ్‌ పెగ్‌ కాన్సెప్ట్‌  ను   హైదరాబాద్‌కు తీసుకువచ్చింది. దీనిలో భాగంగా వినియోగదారులు తమకు దగ్గరలోని పలు బార్ల నుంచి 30 మిల్లీ లీటర్ల పెగ్‌లను బూజీ యాప్‌పై భారీ డిస్కౌంట్‌ ధరకు బుక్‌ చేసుకోవచ్చు.


బూజీ ఫౌండర్‌ మరియు సీఈఓ, వివేకానంద్‌ (వివేక్‌) బలిజెపల్లి మాట్లాడుతూ బార్లు, పబ్‌ల వద్ద తన సొంత   అనుభవాలతోనే దీనిని తీసుకువచ్చామన్నారు. ఏ పబ్‌కు వెళ్లాలనేది ఎప్పుడూ డైలమాగానే ఉంటుందని, అన్నీ ఒకే చోట లభించి, నచ్చినట్లు పార్టీ చేసుకోలేమా అదీ కోరుకునే డీల్స్‌ పొందుతూ అనే భావనతోనే ప్రీ పెయిడ్‌ పెగ్‌ (పీపీపీ) కాన్సెప్ట్‌కు రూపకల్పన చేశామన్నారు.  ‘‘ఈ కాన్సెప్ట్‌ అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందింది. మరీ ముఖ్యంగా యుఎస్‌ఏలో దీనికి అమితాదరణ ఉంది. దీనిలో వినియోగదారునికి వర్ట్యువల్‌ బాటిల్‌  అందుబాటులో ఉంటుంది. దీనితో పాటుగా సామాజిక మాధ్యమ వేదికలు మిళితమై ఉంటాయి. ఇక్కడ తమ అనుభవాలు చెప్పుకుంటూ పార్టీయింగ్‌ చేసుకోవచ్చు. ఇది కేవలం బుకింగ్‌ సర్వీస్‌ మాత్రమే. మద్యం వినియోగం మాత్రం కేవలం  లైసెన్సెడ్‌ ఔట్‌లెట్‌ వద్ద మాత్రమే జరుగుతుంది’’ అని అన్నారు.


బూజీ తమ సేవలను హైదరాబాద్‌లో  అత్యంత ప్రాచుర్యం పొందిన పబ్‌లు హార్ట్‌ కప్‌  కాఫీ, బేబీ ల్యాంబ్‌, పాజ్‌, స్కైలైన్‌ వంటి వాటితో ప్రారంభించింది. త్వరలోనే ఈ సేవలను బెంగళూరు, గుర్‌గావ్‌, ముంబై, ఢిల్లీలో ప్రారంభించనున్నారు.


ఈ నేపథ్యానికి బార్లు/పబ్‌ల నుంచి అమితాదరణ లభిస్తుందన్న వివేక్‌ ‘‘ఈ మోడల్‌తో ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందుతారు. ఇప్పుడు అధిక శాతం మంది చక్కటి నైట్‌ ఔట్‌ పార్టీలను కోరుకుంటున్నారు. ఈ పీపీపీ మోడల్‌తో అతి తక్కువ ధరలోనే పార్టీ చేసుకోవచ్చు. డైన్‌ఔట్స్‌, జొమాటోలలో డిస్కౌంటెడ్‌ మోడల్స్‌ ఉన్నా అక్కడ బార్లు/పబ్‌లు ఖచ్చితమైన అమ్మ కాల భరోసా లేకుండా రాయితీలు ఇస్తాయి.  కానీ ఇక్కడ మేము ముందుగానే చెల్లింపులు చేస్తాం. కాబట్టి స్పందన కూడా అద్భుతంగా ఉంది’’ అని అన్నారు.

More Press News