జెఫ్రీ ద జిరాఫీని మీరు చూశారా ?
హైదరాబాద్, 09 మార్చి 2023 : నేడు హైదరాబాద్ వాసులు తమ కళ్లను అస్సలు నమ్మలేకపోయారు ? ఎందుకంటే వారంతా కూడా నగరంలో అత్యత కీలకమైన ప్రాంతాలలో జెఫ్రీ ని చూశారు ! అందరితోనూ ఎంతో స్నేహంగా ఉండే ఈ జిరాఫీని తొలుత ఎయిర్‌పోర్ట్‌లో చూసిన నగరవాసులు, ఆ తరువాత హుస్సేన్ సాగర్ తీరాన విశ్రాంతి తీసుకుంటూ, అలల అందాలను ఆస్వాదించింది. అక్కడ నుంచి పురాతన కట్టడం చార్మినార్‌కు వెళ్లింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ జిరాఫీ ఆ తరువాత హైటెక్ సిటీ, రామోజీఫిలిం సిటీని కూడా సందర్శించనుంది !