కొరొనరీ అర్టెరీస్లో పేరుకుపోయిన కాల్షియం నిల్వలను తొలగించడం కోసం నూతన టెక్నాలజీ వినియోగించిన కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్
హైదరాబాద్, 13 మార్చి 2023 : కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్ నూతన బెంచ్‌మార్క్‌ను అత్యంత విజయవంతంగా అత్యాధునిక ఆర్బిటాల్ అథెరెక్టమీ డివైజ్ సాంకేతికతను వినియోగించడం ద్వారా క్లీనికల్ ఎక్స్‌లెన్స్ పరంగా ఏర్పరిచింది. ఈ ఉపకరణాన్ని యుఎస్ఏలో గత ఏడు సంవత్సరాలుగా వినియోగిస్తున్నారు ఇప్పుడు ఇది ఇండియాకు కూడా వచ్చింది. తద్వారా భారతీయ రోగులు ఈ నూతన సాంకేతికతతో ప్రయోజనం పొందగలరు. ఈ ప్రక్రియ, ముఖ్యంగా తమ కొరొనరీ అర్టెరీస్ (గుండెకు రక్త సరఫరా చేసే ధమనులు)లో కాల్షియం అధికంగా పేరుకుపోయి, రక్త ప్రసరణ పరంగా తీవ్ర అవరోధాలు ఎదురయ్యే అవకాశాలున్న రోగులకు సహాయకారిగా ఉంటుంది.