భారతదేశములో జస్టిస్ డెలివరిలో మొదటి అయిదు రాష్ట్రాలలో తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాలు ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి

 


■       రాష్ట్రాలు న్యాయ సహాయము కొరకు బడ్జెట్ కేటాయింపును పెంచుతున్నాయి. 2021-22 నాటికి, అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు న్యాయ సహాయము కొరకు తమ బడ్జెట్స్ లో 60 శాతము కంటే ఎక్కువ కేటాయిస్తున్నాయి.

■       జాతీయంగా, సబార్డినేట్ న్యాయవ్యవస్థలో మహిళల వాటా 33% దాటింది

■       జాతీయంగా, తలసరిగా పోలీస్ పై ఖర్చు రూ. 912 (ఎఫ్‎వై ’17-18) నుండి రూ. 1151 (ఎఫ్‎వై ’20-21) వరకు పెరిగింది.

■       వీడియో కాన్ఫరెన్సింగ్ తో జైళ్ళ షేర్ 60% (ఐజేఆర్ 2020) నుండి 84% నికి పెరిగింది

కాని, జాతీయంగా, నిరంతర ఖాళీలు:

■        130% పైగా జైళ్ళ ఆక్రమణ, 2010 నుండి అత్యధికము; ఇంకా 2/3 వంతులమంది ఖైదీలను విచారించవలసి ఉంది.

■       గత దశాబ్దములో రెట్టింపు చేసినప్పటికీ, పోలీసు విభాగములో కేవలం 11.75% మాత్రమే మహిళలు

■        ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు, పోలీసు అధికారులలో అత్యధిక ఖాళీలు; ఇంచుమించు 30%

■       జాతీయంగా, న్యాయ సహాయం క్లినిక్స్ (2019-20 లో 44% నుండి 2020-21 లో 12.976) కు తగ్గించబడ్డాయి

 

ఏప్రిల్ 4, 2023, కొత్త ఢిల్లీ: దేశములో జస్టిస్ డెలివరి పై రాష్ట్రాల ర్యాంకింగ్ లో భారతదేశములో ఒకేఒక్కటైన 2022 ఇండియా జస్టిస్ రిపోర్ట్ (ఐజేఆర్) 18 పెద్ద మరియు మధ్యస్థ పరిమాణము కలిగిన రాష్ట్రాలలో (ఒక్కొక్కటి ఒక కోటికి పైగా జనాభా కలిగినవి) కర్ణాటక మొదటి స్థానములో ఉంది, దాని తరువాత తమిళనాడు (2020: 2వ స్థానము), తెలంగాణ (2020: 3వ స్థానము), గుజరాత్ (2020: 6వ స్థానము) మరియు ఆంధ్రప్రదేశ్ (2020: 12వ స్థానము) అని ఈరోజు ప్రకటించింది. ఏడు చిన్న రాష్ట్రాల జాబితాలో (ఒక్కొక్కటి ఒక కోటి కంటే తక్కువ జనాభా కలిగినవి) సిక్కిం మొదటి స్థానములో ఉంది (2020: 2వ స్థానము), తరువాతి స్థానాలలో అరుణాచల్ ప్రదేశ్ (2020: 5వ స్థానము) మరియు త్రిపుర (2020: 1వ స్థానములో) ఉన్నాయి.

టాటా ట్రస్ట్స్ ద్వారా 2019లో ఇండియా జస్టిస్ రిపోర్ట్ (ఐజేఆర్) ప్రారంభించబడింది మరియు ఇది మూడవ సంచిక.

 భాగస్వాములలో ఉన్నవారు సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాస్, కామన్ వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్, దక్ష్, టిఐఎస్‎ఎస్ – ప్రయాస్, విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ మరియు ఐజేఆర్ యొక్క డేటా భాగస్వామి హౌ ఇండియా లివ్స్.

కఠినమైన 24-నెలల పరిణామాత్మక పరిశోధన ద్వారా, ఐజేఆర్ 2022, ఇదివరకటి రెండు మాదిరిగానే, తప్పనిసరి సేవలను సమర్థ వంతంగా అందించుటకు, తమ జస్టిస్ డెలివరీ నిర్మాణాలను ప్రారంభించడములో రాష్ట్రాల పురోగతిని ట్రాక్ చేసింది. అధీకృత ప్రభుత్వ వనరుల నుండి తాజా అధికారిక గణాంకాల ఆధారంగా, ఇది పోలీసు, న్యాయవ్యవస్థ, జైళ్ళు మరియు న్యాయ సహాయము వంటి జస్టిస్ డెలివరీ యొక్క నాలుగు స్తంభాలులపై ఆధారపడిన సమాచారాన్ని ఒకచోటికి తీసుకొస్తుంది. ప్రతి స్తంభము రాష్ట్రము యొక్క సొంతంగా ప్రకటించబడిన ప్రమాణాలు మరియు బెంచ్‎మార్కులకు వ్యతిరేకంగా బడ్జెట్లు, మానవ వనరులు, పనిభారము, వైవిధ్యము, మౌలికసదుపాయాలు మరియు ధోరణుల (అయిదు-సంవత్సరాల కాలములో మెరుగుపరచే ఉద్దేశము) ద్వారా విశ్లేషించబడింది. ఈ మూడవ ఐజేఆర్ 25 రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ యొక్క సామర్థ్యాన్ని కూడా విడిగా అంచనావేసింది (మరింత సమాచారము కొరకు ఎస్‎హెచ్‎ఆర్‎సి సంక్షిప్తాన్ని చూడండి)

తెలంగాణ పనితీరు

ఈ సంవత్సరం మొదటి అయిదు పాల్గొనే రాష్ట్రాలలో నిలుచుటకు తెలంగాణ అన్ని స్తంభాలలో తన పనితీరును మెరుగు పరచుకుంది. తొమ్మిది స్థానాలను దాటుకుంటూ, ఈ రాష్ట్రము పోలీసింగ్ స్తంభములో మొదటి స్థానములో నిలిచింది. ఇది అన్ని స్తంభాలలో మొదటి అయిదు పర్ఫార్మింగ్ రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. 2020 మరియు 2022 మధ్య 61 పోల్చదగిన సూచికలలో, తమిళనాడు అన్ని స్తంభాలలో 34 సూచికలలో పురోగతి సాధించింది. ఇండియా జస్టిస్ రిపోర్ట్ యొక్క మూడవ సంచికలో, ఈ క్రింది కీలకమైన కారణాల కారణంగా రాష్ట్రము తన మూడవ స్థానాన్ని నిలబెట్టుకుంది:

 

అన్ని స్తంభాలలో మహిళల వాటాను పెంచడము – వరుసగా 27% మరియు 53% గా ఉన్న ఉన్నత న్యాయస్థానము మరియు జిల్లా న్యాయస్థానాలు రెండిటిలో మహిళా న్యాయమూర్తులను పెంచడము. ఇది పెద్ద మరియు మధ్యస్త-పరిమాణము రాష్ట్రాలలో అత్యధికము. జైళ్ళలో సవరణాత్మక సిబ్బందిలో ఖాళీలు 2019 నుండి సున్నాగా ఉన్నాయి


 న్యాయవ్యవస్థలో తలసరి ఖర్చు 2017-18 లో రూ. 140 నుండి 2020-21 లో రూ. 157 కు పెరిగింది తెలంగాణ తన పోలీసు బడ్జెట్లో 2.6% పోలీసు సిబ్బంది శిక్షణ కొరకు కేటాయించింది, ఇది పెద్ద రాష్ట్రాలలో అత్యధికము. ఉన్నత న్యాయస్థానములో న్యాయమూర్తుల ఖాలీలు 2018-19 లో 46% నుండి 2022 లో 21% కి తగ్గాయి. ఈ రాష్ట్రము పోలీసులలో అధికారులు మరియు కానిస్టేబులరీ స్థాయిలలో ఖాళీలను సగానికి తగ్గించింది. ఉన్నత న్యాయస్థానము స్థాయిలో కేస్ క్లియరెన్స్ 2018-19 లో 61% నుండి 2022 లో 103% పెరిగింది. రాష్ట్రములోని అన్ని పోలీసు స్టేషన్లలో కనీసము ఒక్క సిసిటీవి ఉంది న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, మరియు కానిస్టేబులరీలో రాష్ట్రము తన ఎస్టీ మరియు ఓబీసీ కోటాలను పూర్తి చేసింది.
 

More Press News