ఎస్ఎల్‌జీ ఆస్పత్రి సేవలు అనన్య సామాన్యం: మాజీ జేడీ లక్ష్మీనారాయణ
* కొవిడ్ సమయంలో అద్భుతంగా పనిచేశారు
* వైద్య పర్యాటకానికి పెద్దపీట వేస్తున్నారు
* ఇక్కడి సదుపాయాలతో ప్రజలకు ఎంతో ఉపయోగం
* ప్రపంచ ఆరోగ్య దినోత్సవ కార్యక్రమంలో సీబీఐ మాజీ జేడీ ప్రశంసలు
హైదరాబాద్, ఏప్రిల్ 7, 2023: దివంగత మాజీ రాష్ట్రపతి ఎప్పుడూ పెద్ద కలలు కనమనేవారు. చిన్న కలలు వద్దనేవారు. ఆయన చెప్పినట్లే అన్ని విభాగాలకు అవసరమైన సకల సదుపాయాలతో ఈ ప్రాంత వాసులకు సేవలు అందించేలా ఇంత పెద్ద ఆస్పత్రి కట్టినందుకు దండు శివరామరాజుకు అభినందనలు అని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ప్రశంసించారు. ఆస్పత్రి సేవలు అనన్య సామాన్యమని కొనియాడారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలో 250 ప్రత్యేక పడకలతో అతి తక్కువ మరణాలతో అద్భుతంగా పనిచేశారన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆస్పత్రి ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, ఈ ఆస్పత్రి సీఎండీ దండు శివరామరాజు పుట్టినరోజు ఒక్కటే కావడం ఎంతో సంతోషం. ఆయన దార్శనికతకు నిదర్శనంగా ఈ ఆస్పత్రి కనిపిస్తోంది. ఇక్కడి వైద్యుల నిబద్ధత, రోగులకు అందుబాటులో ఉన్న అత్యాధునిక సదుపాయాలు.. ఇవన్నీ చూస్తుంటే ముచ్చట వేస్తోంది. ఎయిర్ అంబులెన్సులు నేరుగా ఆస్పత్రిపైనే దిగే అవకాశం ఉండటం, అక్కడి నుంచి రోగులను నేరుగా ఆపరేషన్ థియేటర్లలోకి తీసుకెళ్లగలగడం, ఫార్మసీకి రోగుల సహాయకులు పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా అక్కడినుంచి నేరుగా వార్డుల్లోకి మందులు వచ్చే సదుపాయం, కేన్సర్ రోగులకు చికిత్స అందించేదుకు కోట్ల రూపాయల విలువ చేసే పరికరాలు.. ఇవన్నీ ఇక్కడే చూడగలం. డాక్టర్ రంగనాథన్ గారితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన వల్లే నా భార్య లేచి తన కాళ్లపై నిలబడగలుగుతున్నారు. ఆమెకు దాదాపు 20 ఏళ్ల క్రితం ఆయన 9 గంటల ఆపరేషన్ చేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డీవీఎస్ సోమరాజు విజన్ చాలా బాగుంది. వయోవృద్ధులను దృష్టిలో పెట్టుకుని వారికి ప్రత్యేక ప్యాకేజిలు ప్రకటించడం లాంటివి అందరికీ అందుబాటులో వైద్యాన్ని చేరుస్తాయి. ఆస్పత్రి యాజమాన్యానికి, వైద్యులకు, నర్సులకు.. ఇలా అందరికీ అభినందనలు. ఈ ఆస్పత్రి కేవలం బాచుపల్లి ప్రాంత వాసులకే కాదు, దేశానికే తలమానికం. తక్కువ ఖర్చుతో ప్రజలకు అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తున్నందుకు ఆస్పత్రి యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని ఆయన తెలిపారు.
లాభాపేక్ష కాదు.. ప్రజాసేవే పరమావధి
ఎస్ఎల్‌జీ ఆస్పత్రిని నెలకొల్పాలని తాము అనుకున్నప్పుడు అందులో లాభాల గురించి ఏమాత్రం ఆలోచించలేదని, ఈ ప్రాంతవాసులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలకు, పొరుగు రాష్ట్రాల వారికి కూడా అత్యుత్తమ వైద్య సేవలను అందించాలనే భావించామని ఆస్పత్రి సీఎండీ దండు శివరామరాజు అన్నారు. దానికి తగినట్లే ఆస్పత్రికి ప్రజాదరణ బాగుందని, అన్ని రకాల సమస్యలకు సమర్థంగా చికిత్స చేసే వైద్యులు అందుబాటులో ఉండటం తమకు వరమని ఆయన చెప్పారు. అందరి సంపూర్ణ సహకారంతో ఆస్పత్రి మరింత విజయవంతం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
60 ఏళ్లు దాటినవారికి ఉచిత ప్యాకేజి: సోమరాజు
ప్రపంచ ఆరోగ్యదినోత్సవం సందర్భంగా ఎస్ఎల్‌జీ ఆస్పత్రి ఆధ్వర్యంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచితంగా వైద్యసేవలు అందించాలని నిర్ణయించినట్లు ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డీవీఎస్ సోమరాజు తెలిపారు. ఈ నెల 7 నుంచి 14వ తేదీ వరకు ఈసీజీ, 2డి ఎకో, ఎక్స్ రే, ఆర్‌బీఎస్, ఎముకల సాంద్రతను నిర్ధారించే డెక్సాస్కాన్ లాంటి పరీక్షలు పూర్తి ఉచితంగా చేస్తామన్నారు. దాంతోపాటు ఫిజిషియన్, కార్డియాలజిస్టుల కన్సల్టేషన్ కూడా ఉంటుందని తెలిపారు. ఒకవేళ వీటితోపాటు అదనంగా ఇంకా ఏమైనా పరీక్షలు చేయాలని వైద్యులు సూచిస్తే, వాటన్నింటిపైనా 50% రాయితీ ఇస్తామని చెప్పారు. పెద్ద వయసు వారికి మెట్లు ఎక్కినా, నడిచినా ఆయాసం వస్తుందని అది ఊపిరితిత్తులు లేదా గుండెలో సమస్య కావచ్చని.. అందువల్ల అలాంటివారంతా ఈ ప్యాకేజిని ఉపయోగించుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఆస్పత్రిలోని వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు, నర్సులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.