దెబ్బతిన్న మోచేతిని, భుజాన్ని స‌రిచేసి.. తిరిగి క‌ద‌లిక‌లు తెచ్చిన అమోర్ ఆసుపత్రి వైద్యులు

* రోడ్డుప్ర‌మాదంలో కుడి మోచేయి, భుజం తీవ్రంగా దెబ్బ‌తిన్న యువ‌కుడు

* సంక్లిష్ట‌మైన శ‌స్త్రచికిత్స‌ను విజ‌య‌వంతంగా చేసిన డాక్ట‌ర్ అభినంద‌న్ బాదం

 హైదరాబాద్, ఏప్రిల్ 17, 2023: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి, కుడి మోచేతిని.. భుజాన్ని అస్స‌లు క‌దిలించ‌లేని ప‌రిస్థితిలో ఉన్న రోగికి సంక్లిష్ట‌మైన శ‌స్త్రచికిత్స చేసి పూర్తి ఊర‌ట క‌ల్పించారు. న‌గ‌రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్ర‌ముఖ ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన అమోర్ ఆస్ప‌త్రి వైద్యులు ఈ ఘ‌న‌త సాధించారు. అత్యంత అధునాత‌న ప‌రిక‌రాల‌ను ఉప‌యోగించి, బ్రాకియ‌ల్ ప్లెక్స‌స్ ఇంజ్యురీ అయిన‌ప్పుడు ఇలాంటి సంక్లిష్ట శ‌స్త్రచికిత్స‌ల‌ను విజయవంతంగా చేయ‌గ‌ల హైదరాబాద్ లోని అతికొద్ది ఆస్ప‌త్రుల‌లో అమోర్ ఆస్ప‌త్రి ఒకటి.

 మంచిర్యాలకు చెందిన 28 ఏళ్ల యువ‌కుడిని అమోర్ ఆసుపత్రిలోని ప్లాస్టిక్, రీక‌న్‌స్ట్ర‌క్టివ్‌ శస్త్రచికిత్స విభాగానికి వేరే ఆస్ప‌త్రి నుంచి పంపారు. అత‌డి భుజం, మోచేయి కదలికలు లేకపోవడంతో పాటు కుడి చేతికి అస‌లు స్ప‌ర్శ కూడా లేకుండా బాధపడుతున్నాడు. పెద్ద రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత రోగికి ఈ విషయం తెలిసింది.


రోగి స‌మ‌స్య‌, చేసిన శ‌స్త్రచికిత్స గురించి అమోర్ ఆసుపత్రికి చెందిన‌ కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ రీకన్‌స్ట్ర‌క్టివ్ సర్జన్ డాక్టర్ అభినందన్ బాదం మాట్లాడుతూ, “బ్రాకియల్ ప్లెక్సస్ అనేది వెన్నెముక నుంచి వ‌చ్చే..  మెడలోని నరాల సంక్లిష్ట నెట్‌వ‌ర్క్. ఈ నరాల వ‌ల్లే భుజం, మోచేయి, మిగిలిన చేతిలో కదలికలు సాధ్య‌మ‌వుతాయి. రోగికి జ‌రిగిన ప్ర‌మాదంలో ఈ న‌రాల నెట్‌వ‌ర్క్ దెబ్బ‌తింది. ప్ర‌మాదాల్లో ఇలా జ‌ర‌గ‌డం స‌ర్వ‌సాధార‌ణం. కానీ, స‌మ‌స్య‌ను వెంట‌నే గుర్తించ‌డంతో పాటు వీలైనంత త్వ‌ర‌గా శ‌స్త్రచికిత్స చేస్తే దీనికి మంచి ఫ‌లితాలు వ‌స్తాయి.

ఎంఆర్ఐతో పాటు క్లినిక‌ల్ ప‌రీక్ష‌లు చేసి, న‌రాలలోని విద్యుత్ ప్ర‌సార వ్య‌వ‌స్థ‌ను ప‌రిశీలించిన త‌ర్వాత‌.. రోగి ప‌రిస్థితి, గాయం తీవ్ర‌త‌పై ఓ నిర్ణ‌యానికి వ‌చ్చాం. ప్ర‌మాదం త‌ర్వాత రెండు నెలలు ఫిజియోథెరపీ చేసినా మోచేతి ప్రాంతంలో స్వల్ప కదలిక మినహా పెద్దగా మెరుగుదల కనిపించలేదు. దాంతో మా వ‌ద్ద‌కు తీసుకురాగా, రోగికి బ్రాకియ‌ల్ ప్లెక్స‌స్ ఎక్స్‌ప్లొరేష‌న్ చేసి, ఆ త‌ర్వాత న‌రాల గ్రాఫ్టింగ్ చేశాం. ఆ త‌ర్వాత అత్యాధునిక మైక్రోస‌ర్జిక‌ల్ ప్రొసీజ‌ర్ అయిన నెర్వ్ ట్రాన్స్‌ఫ‌ర్ చేశాం. అందులో భాగంగా ప‌నిచేయ‌ని న‌రాల స్థానంలో ప‌నిచేసే ఇత‌ర న‌రాల‌ను తీసుకొచ్చి పెట్టాం. దాంతో అత‌డి న‌రాలు మ‌ళ్లీ చేత‌న స్థితికి చేరుకున్నాయి” అని డాక్ట‌ర్ అభినంద‌న్ తెలిపారు.

 న‌రాల‌ను రిపేర్ చేసి, గ్రాఫ్టింగ్, నెర్వ్ ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన త‌ర్వాత‌.. న‌రాలు మ‌ళ్లీ ఉత్ప‌త్తి అయ్యేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. దీనివ‌ల్ల క‌ద‌లిక‌ల‌తో పాటు స్ప‌ర్శ కూడా వ‌స్తుంది. ఇలాంటి పరిస్థితులను ముందుగానే గుర్తించి, ప్ర‌మాదం జ‌రిగిన ఆరు నెల‌ల్లోగా ఈ శ‌స్త్రచికిత్స చేయ‌డం చాలా ముఖ్యం. ముందుగా గుర్తిస్తే వీటినుంచి కోలుకునేందుకు 80-90% అవ‌కాశం ఉంటుంది. అదే ఆరు నెల‌ల త‌ర్వాత చేస్తే విజ‌య‌వంతం అయ్యే అవ‌కాశాలు గ‌ణ‌నీయంగా త‌గ్గిపోతాయి. అందువ‌ల్ల ముందుగానే ప్లాస్టిక్, రీక‌న్‌స్ట్ర‌క్టివ్ స‌ర్జ‌న్ వ‌ద్ద‌కు తీసుకెళ్ల‌డం చాలా ముఖ్యం. దాంతోపాటు త‌గిన స‌దుపాయాలు, నైపుణ్యం ఉన్న ఆస్ప‌త్రిని ఎంచుకోవ‌డం కూడా ఇలాంటి కేసుల చికిత్స‌లో ఎంతో ప్రధానం.

More Press News