ఉచ్ఛ్వాస్ ట్రాన్సిషనల్ కేర్‌కు ప్రతిష్ఠాత్మక క్వాలిటీ అవార్డు
హైదరాబాద్, ఏప్రిల్ 27, 2023: హైదరాబాద్‌లోని ప్రముఖ ట్రాన్సిషనల్ కేర్ సెంటర్, ప్రజల సంస్థగా విలువల ఆధారంగా ఏర్పాటైన ఉచ్ఛ్వాస్ ట్రాన్సిషనల్ కేర్ సెంటర్‌కు ప్రతిష్ఠాత్మక క్వాలిటీ అండ్ అక్రిడిటేషన్ ఇన్‌స్టిట్యూట్ (క్యూఏఐ) గుర్తింపు లభించింది. ట్రాన్సిషనల్ కేర్ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి, నాణ్యమైన సేవలు అందిస్తున్నందుకు గాను క్వాలిటీ అండ్ అక్రిడిటేషన్ ఇన్‌స్టిట్యూట్ (క్యూఏఐ) నుంచి ఈ గుర్తింపు వచ్చింది.
60 వేలకు పైగా బెడ్ ఆక్యుపెన్సీ రోజులతో రెండువేల మందికి పైగా పేషెంట్లకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత సేవలు అందించిన ఉచ్ఛ్వాస్ ట్రాన్సిషనల్ కేర్.. రీహాబిలిటేటివ్ కేర్ రంగంలో సరికొత్త మార్పును తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత అవసరమైన సంరక్షణను ఈ సంస్థ అందిస్తోంది.
విద్య, శిక్షణ, నాణ్యత మెరుగుదల, అక్రిడిటేషన్ / సర్టిఫికేషన్ చేయడానికి ఏర్పాటుచేసిన సంస్థ... క్యూఏఐ, క్వాలిటీ అండ్ అక్రిడిటేషన్ ఇన్‌స్టిట్యూట్. కేవలం ట్రాన్సిషనల్ కేర్ యూనిట్లకు సంబంధించిన అత్యున్నత ప్రమాణాలు పాటించడం ఒక్కటే కాదు.. క్లినికల్, మేనేజిరియల్, అడ్మినిస్ట్రేటివ్ కేర్ లో దాని రోజువారీ ప్రాక్టీసులలో ప్రామాణిక ఆపరేటింగ్ పద్ధతులను (ఎస్ఓపీ) పాటిస్తున్నందుకు, రోగి భద్రత పరంగా ఉన్నత ప్రమాణాలను అమలు చేస్తున్నందుకు క్యూఏఐ నుంచి గుర్తింపు లభించింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత రోగులు కోలుకునే విషయంలో నాణ్యతా ఫలితాలకు ఈ సర్టిఫికేషన్ ఒక ధ్రువీకరణ.
ఈ ఘనత సాధించిన సందర్భంగా ఉచ్ఛ్వాస్ ట్రాన్సిషనల్ కేర్ చైర్మన్ డాక్టర్ ఎ.రాంపారావు మాట్లాడుతూ, “ఉచ్ఛ్వాస్ ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి, ఎందుకంటే రోగి సంరక్షణ ప్రమాణాలను చేరుకోవడం లేదా అధిగమించడం మాత్రమే కాకుండా... మా పనితీరును పర్యవేక్షించడానికి, మేము అందించే సంరక్షణ, సేవల స్థాయిని పెంచడానికి ప్రణాళికలను అమలు చేయడానికి కట్టుబడి ఉన్నాం. ఈ సందర్భంగా మన ఫిజియోథెరపిస్టులు, ఫిజీషియన్లు, నర్సులు, న్యూట్రిషనిస్టులు, ఆపరేషన్ బృందాలు, సిబ్బంది అందరూ చాలా నెలల పాటు ఎంతో శ్రద్ధతో.. నాణ్యత, భద్రత విషయంలో అద్భుతంగా పనిచేస్తున్నందుకు వారందరినీ ఎంతగానో అభినందించాలి. ఈ గుర్తింపు ఉచ్వాస్ గర్వించదగిన విజయం. మేం ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవాలనుకుంటున్నాము. ఈ విజయం గురించి మీకు వివరించడానికి, మేం మరింత వేగంగా అడుగులు వేయడానికి ఎలా కల్పిస్తుందో చెప్పడానికి మీ విలువైన సమయాన్ని కోరుతున్నాం” అన్నారు.
ఏపీఏసీ (ఆసియా పసిఫిక్ అక్రిడిటేషన్ కోఆపరేషన్), ఇంటర్నేషనల్ ల్యాబొరేటరీ అక్రిడిటేషన్ కోఆపరేషన్ లో సభ్యత్వం ఉన్న క్యూఏఐకి.. ఐఎస్‌క్యూయూఏ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ క్వాలిటీ ఇన్ హెల్త్‌కేర్)లో సంస్థాగత సభ్యత్వం ఉంది. ఇంకా ఐఎస్ఎఫ్‌టీఈహెచ్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ టెలిమెడిసిన్ అండ్ ఈహెల్త్) లో బోర్డు సభ్యత్వం ఉంది. సీఏహెచ్ఎస్సీ (సెంటర్ ఫర్ అక్రిడిటేషన్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ కేర్) విభాగం ద్వారా ఉచ్ఛ్వాస్ వంటి సంస్థలు స్వీయ మదింపు, పీర్ రివ్యూ ప్రక్రియ ద్వారా స్వీయ-నియంత్రిత నాణ్యత మెరుగుదల కార్యక్రమంలో ముందుకు సాగడానికి వీలు కల్పిస్తుంది.
ట్రాన్సిషనల్ కేర్, రీహాబిలిటేషన్ యూనిట్ల కోసం క్యూఏఐ 9 అధ్యాయాలతో కూడిన 291 ప్రమాణాలను
రూపొందించింది. దరఖాస్తుదారు సంస్థ ఈ 'సెట్ స్టాండర్డ్స్'కు ఎంతవరకు కట్టుబడి ఉందన్న విషయం క్యూఏఐ గుర్తింపు ద్వారా తెలుస్తుంది. ఈ ప్రమాణాలకు ఉచ్ఛ్వాస్ లాంటి సంస్థల సమ్మతిని ధ్రువీకరించడానికి క్యూఏఐ తన సొంత స్కోరింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. డాక్యుమెంట్ సవరణలు, గతంలోని 'క్వాలిటీ ప్రోగ్రామ్ రికార్డుల' సమీక్ష, ఫిజికల్ సైట్ వెరిఫికేషన్ ద్వారా పనిచేసే ప్రాంతాల్లో ప్రక్రియల ప్రామాణీకరణ, కీలక ఫంక్షనల్ వనరుల ఇంటర్వ్యూలు, నివేదికను రూపొందించడానికి ముందు యూనిట్ లో వివిధ క్లినికల్, సేఫ్టీ డ్రిల్స్ అన్నింటినీ చూస్తుంది.