2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి

జనవరి 2 నుండి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిర్వహించే 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో 2వ విడత పల్లె ప్రగతి నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషి తో కలిసి ప్రభుత్వం నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికారులతో  సమావేశం నిర్వహించిన అనంతరం, జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు పల్లె ప్రగతి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని మొదటి దశ విజయవంతంగా నిర్వహించారని, రెండవ విడత పల్లె ప్రగతి విజయవంతానికి తగు కార్యాచరణ  ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు.

పల్లెప్రగతి నిర్వహణతో దేశవ్యాప్తంగా రాష్ట్రానికి మంచి గుర్తింపు వచ్చిందని, రెండవ విడత నిర్వహణకు సంబంధించి జిల్లా స్ధాయి సమావేశాల నిర్వహణను వెంటనే పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. గ్రామ పంచాయతీల కోసం ప్రతి నెల 339 కోట్లను విడుదల చేశామన్నారు. గ్రామాలలోని యువకులను, మహిళలను, పెన్షనర్లను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు అయ్యేలా చూడాలన్నారు. గ్రామాల వారిగా చేపట్టిన, చేపట్టపోయే పనులు, కార్యక్రమాల వివరాలపై బుక్ లెట్ అందించాలన్నారు. పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో  ట్రాక్టర్ ల కొనుగోలుకు చర్యలు సత్వరం పూర్తి చేయాలన్నారు. తమ గ్రామాలను తామే పరిశుభ్రంగా ఉంచుకునే స్పూర్తి కలిగేలా ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు.

గ్రామాల్లో నర్సరీల పెంపకం, వైకుంఠదామాలు, Dumping యార్డులకు స్ధలసేకరణ, నాటిన మొక్కల సంరక్షణ, శిధిల గృహాల తొలగింపు, పాతబావుల పూడ్చివేత, డస్ట్ బిన్ల సరఫరా, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం లాంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికారులు జనవరి 2 న నిర్వహించే గ్రామ సభలలో పాల్గొనాలన్నారు.

 గ్రామాలలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సరియైన రీతిలో పల్లె ప్రగతిని నిర్వహించేలా చూడాలన్నారు. విధులలో నిర్లక్ష్యం వహించే వారిపై  చర్యలు తీసుకోవడం తో పాటు  మంచిగా పనిచేసే వారిని ప్రోత్సహించాలన్నారు. ముఖ్యమంత్రి గారు ఆదేశించిన మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. పరిశుభ్రతలో మెదక్ జిల్లా మల్కాపూర్ గ్రామాన్ని స్పూర్తిగా తీసుకొని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె జోషి మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమాల పనితీరును పరిశీలించేందుకు 50 మంది రాష్ట్ర స్ధాయి అధికారులను Flying Squad  అధికారులుగా నియమించామని, ప్రతి అధికారికి వివిధ జిల్లాలలోని 12 మండలాలను కేటాయించామని, మండలంలో 2 గ్రామ పంచాయతీలను సందర్శించి పనుల పురోగతిని, నాణ్యతను, కార్యక్రమ అమలును పరిశీలిస్తారని అన్నారు. జనవరి 2 న నిర్వహించే గ్రామసభలో పాల్గొనాలని అన్నారు.

మార్చి 31 నాటికి తమకు కేటాయించిన మండలాలను సందర్శించి పల్లె ప్రగతి కార్యక్రమాల అమలును, గ్రామాలకు చేకూరిన లబ్ధిని అంచనా వేయాలన్నారు. ప్రతి అధికారికి 23 అంశాల  ప్రోఫార్మాను అందజేశామని, ప్రతి అంశానికి 1 నుండి 5 వరకు గ్రేడింగ్ ఇవ్వాలన్నారు. పంచాయతీ రాజ్ శాఖ రూపొందించే మోబైల్ ఆప్ లో డాటాను ఫీడ్ చేయాలని సూచించారు.

రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీని మోడల్ గ్రామ పంచాయతీగా అభివృద్ధి చేసి దేశంలో Role Model గా నిలవాలని ముఖ్యమంత్రి గారి ఉద్ధేశ్యాన్ని సక్రమంగా అమలుచేయాలని సి.యస్ కోరారు. 2 వ విడత పల్లెప్రగతి కార్యక్రమానికి ముందే గత పల్లె ప్రగతి కార్యక్రమాల అమలు, ఖర్చు, రెండవ విడత నిర్వహణ ప్రణాళిక, బడ్జెట్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు రూపొందించాలన్నారు. 

ప్రత్యేక ఆఫీసర్స్ తమకు కేటాయించిన గ్రామాలను సందర్శించాలన్నారు. గత నాలుగు నెలలుగా చేసిన ఖర్చు Mandal Panchayat  officers validate చేయాలన్నారు. రెండవ విడతలో పల్లె ప్రగతిలో ఒక రోజు శ్రమదానానికి ప్రత్యేకంగా కేటాయించాలన్నారు. గ్రామాలలో పచ్చదనం, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాడానికి సంసిధ్ధంగా ఉండాలన్నారు.

పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ మాట్లాడుతూ గ్రామాల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రత్యేక చట్టాన్ని తేవడంతో పాటు, గ్రామాలకు, గ్రామకార్యదర్శులను, పంచాయతీ రాజ్ శాఖలో అన్నిస్ధాయిలలో సిబ్భంది నియామకాన్ని చేపట్టి, ప్రతినెల 339 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. ప్రతి గ్రామానికి సంబంధించి వార్షిక ప్రణాళికతో పాటు 5 సంవత్సరాల  ప్రణాళికను రూపొందించామన్నారు. పల్లె ప్రగతిపై ముఖ్యమంత్రి, మంత్రులు, MLA,MLC లు రాష్ట్ర యంత్రాంగం  ప్రత్యేక దృష్టి  సారించిందని కలెక్టర్లు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు.

ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు ప్రతి గ్రామ పంచాయతీలో చేపట్టిన, చేపడుతున్న పనులపై Data Sheet ను రూపొందించాలన్నారు.సి.యం కార్యదర్శి స్మితాసభర్వాల్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలలో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసేలా గౌరవ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు పల్లె ప్రగతి కార్యక్రమాలను ప్రారంభించారని, మొదటి దశ విజయవంతంగా పూర్తి చేశామని, రెండోదశను అదే స్పూర్తితో ప్రజలంతా పాల్గొని విజయవంతంగా కృషి చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్ధ్యం, పచ్చదనం, వైకుంఠదామాలు, డంపింగ్ యార్డుల నిర్మాణాలు, ట్రాక్టర్ల కొనుగోలు, మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా మంచినీటి సరఫరా, నల్లాల పనితీరును మొదలగు అంశాలపై దృష్టి సారించాలన్నారు.

పంచాయతీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు మాట్లాడుతూ అన్ని గ్రామాలలో పల్లె ప్రగతి విజయవంతం చేయడానికి కలెక్టర్లు దృష్టి చేయాలన్నారు. Flying Squad  అధికారులు ఆకస్మికంగాను, సాధారణంగాను పర్యటిస్తారని అన్నారు. గ్రామ స్ధాయి వరకు సమావేశాలను పూర్తి చేసుకోవాలన్నారు. నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను గతంలోనే పంపామన్నారు. జనవరి 2 న గ్రామసభలను సక్రమంగా నిర్వహించాలన్నారు. అంగన్ వాడీలు, పాఠశాలలు, ఆసుపత్రులను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.

ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి కె.రామక్రిష్ణారావు, పంచాయతీ రాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, కార్మిక, ఉపాధిశాఖ ముఖ్యకార్యదర్శి శంషాంక్ గోయల్, MCRHRD అడిషనల్ డి.జి  హరిప్రీత్ సింగ్,  సి.ఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, రిజిస్ట్రేషన్ శాఖ ఐ.జి చిరంజీవులు, కమర్షియల్ ట్యాక్స్ కమీషనర్ నీతూప్రసాద్, ఎక్సైజ్ శాఖ కమీషనర్ సర్పరాజ్ అహ్మద్. మేడ్చల్ కలెక్టర్ M.V.రెడ్డి, సివిల్ సప్లయ్ కమీషనర్ సత్యనారాయణ రెడ్డి, దేవాదాయ కమీషనర్ అనీల్ కుమార్, పోలీస్ అధికారులు గోవింద్ సింగ్, D.S. చౌహన్ లతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.


More Press News