ఆకట్టుకుంటున్న అనంత ట్రైలర్.. జూన్ 9న విడుదల

సినిమాల్లో కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కోసం ప్రత్యేకంగా రూపొందుతున్న చిత్రం అనంత. డిఫరెంట్ స్టోరీ లైన్ తీసుకొని గతంలో ఎప్పుడు చూడని కోణంలో కథను తెరపై ఆవిష్కరించబోతున్నారు డైరెక్టర్ మధు బాబు. సైంటిఫిక్ థ్రిల్లర్ గా అనంత అనే మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రశాంత్ కార్తీ హీరోగా నటిస్తున్నాడు. గతంలో రామ్ గోపాల్ వర్మ రూపొందించిన కొండా చిత్రంలో నక్సలైట్ నాయకుడు RK రోల్ పోషించి ఆకట్టుకున్న ప్రశాంత్ కార్తీ ఈ సినిమాతో మరో డిఫరెంట్ క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 

ఈ చిత్రానికి మధు బాబు దర్శకత్వం వహిస్తుండగా A ప్రశాంత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో ప్రశాంత్ కార్తీ సరసన రిత్తిక చక్రవర్తి హీరోయిన్ గా నటిస్తోంది. అనీష్ కురువిళ్ళ, లయ సింప్సన్, శ్రీనివాస్ J గడ్డం, రమేష్.కే, అనిల్ కుమార్, కీర్తి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఘంటసాల విశ్వనాధ్ సంగీతం అందిస్తున్నారు. 


ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచిన యూనిట్.. తాజాగా అనంత ట్రైలర్ రిలీజ్ చేశారు. ఒక నిమిషం 46 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ లో ఆసక్తికర సన్నివేశాలు చూపిస్తూ సినిమా కథను రిఫ్లెక్ట్ చేశారు. మనిషి పుట్టిన మరు క్షణం నుంచే ఆ శరీరం మరణం వైపు ప్రయాణం చేస్తుంటుంది అనే డైలాగ్ సినిమా సోల్ ఏంటో తెలుపుతోంది. మనిషి ఆయుష్షు నేపథ్యంలో ఈ మూవీ కథ సాగుతుందని అర్థమవుతోంది. ఇన్వెస్టిగేషన్ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ టచ్ చేస్తూ ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇదో డిఫరెంట్ కథ అని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. 

ఇది రెగ్యులర్ సినిమా కాదని, డిఫరెంట్ పాయింట్స్ టచ్ చేస్తూ ఈ అనంత రూపొందించారని టీజర్, ట్రైలర్ స్పష్టం చేశాయి. దీంతో ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిలో పడింది అనంత మూవీ. సెన్సార్ పూర్తి చేసుకొని U సర్టిఫికెట్ పొందిన ఈ సినిమాను జూన్ 9వ తేదీన థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.

More Press News