ప్రత్యేకమైన పరిచయ ధర రూ. 10,89,900కి ఆరంభమయ్యే అత్యంత ఆధునిక కొత్త సెల్టోస్ ఆరంభించిన కియా
డీజిల్ మరియు టర్బో పెట్రోల్ ఇంజన్స్ లో ఏడీఏఎస్ లెవెల్ 2, జీటీ-లైన్ & ఎక్స్-లైన్ తో ప్రముఖ రకాలు రూ 19,79,900 & 19,99,900 లక్షలు (ఎక్స్-షోరూం)కి లభిస్తాయి
- 18 వేరియెంట్స్ నుండి ఎంచుకోవచ్చు- నాలుగు 6 ఎంటీ ట్రిమ్స్ తో స్మార్ట్ స్ట్రీమ్ జి 1.5 పెట్రోల్ ఇంజన్ మరియు ఒక ఐవీటీ, రెండు 6iMTతో స్మార్ట్ స్ట్రీమ్ జీ 1.5 టీ – జీడీఐ పెట్రోల్ ఇంజన్ మరియు మూడు 7 డీసీటీ, మరియు అయిదు 6iMTతో మరియు మూడు 6AT ట్రిమ్స్ తో 1.5లీ CRDi వీజీటీ డీజిల్ ఇంజన్.
- అత్యంత అభివృద్ధి చెందిన ఏడీఏఎస్ స్థాయి 2 (జీటీ-లైన్ & X-లైన్) తో పాటు 15 దృఢమైన భద్రతా ఫీచర్స్ సహా 32 భద్రతా ఫీచర్స్ తో శక్తివంతం చేయబడిన యాక్టివ్ సేఫ్టీ
- 1వ రోజు 13,424 ప్రీ-బుక్కింగ్స్ తో, కొత్త సెల్టోస్ ఇప్పుడు శ్రేణిలోనే – అత్యధికంగా 1వ రోజు బుక్కింగ్స్ ను నమోదు చేసింది
న్యూఢిల్లీ, 21 జులై 2023 - దేశంలో ప్రీమియం కారు తయారీదారు కియా ఇండియా, ఈ రోజు కొత్త సెల్టోస్ తో ఉత్తమమైన సెల్టోస్ డ్రైవ్ అనుభవాన్ని ప్రత్యేకమైన పరిచయ ధర రూ. 10,89,900 (ఎక్స్-షోరూం) కి పాన్-ఇండియా విడుదల చేసింది. ఈ నెల ఆరంభంలో అనగా 4 జులై 2023న విడుదల చేయబడిన కొత్త సెల్టోస్ అత్యంతగా ఆశించబడిన ఎస్ యూవీ. ఇది 18 వేరియెంట్స్ లో డీజిల్ మరియు పెట్రోల్ ఇంజన్స్ రెండిటిలో
ADAS – జీటీ-లైన్ & ఎక్స్ లైన్ తో గొప్ప ట్రిమ్ తో, రూ. 19,79,900 & రూ. 19,99,900 కి, ఎక్స్-షోరూం ధరకి పాన్-ఇండియా వ్యాప్తంగా లభిస్తోంది. గత వారం, కొత్త సెల్టోస్ అనూహ్యమైన స్పందన పొందింది. శ్రేణిలోనే అత్యధికంగా 1వ రోజు 13,424 యూనిట్స్ బుక్కింగ్స్ ను నమోదు చేసింది.
కొత్త సెల్టోస్ స్పోర్టియర్ పెర్ఫార్మెన్స్, దృఢమైన ఎక్స్ టీరియర్, ఆధునిక కేబిన్ మరియు ఆధునిక టెక్నాలజీతో సెల్టోస్ బ్రాండ్ వారసత్వాన్ని కొనసాగించింది. 15 దృఢమైన భద్రతా ఫీచర్స్ (శ్రేణిలో స్టాండర్డ్) మరియు 17 ఏడీఏఎస్ లెవెల్ 2 స్వతంత్ర ఫీచర్స్ సహా 32 భద్రతా ఫీచర్స్ తో కొత్త సెల్టోస్ విలక్షణమైన, సురక్షితమైన మరియు స్మార్టర్ డ్రైవ్ అనుభవాన్ని ఇస్తుంది. కొత్త సెల్టోస్ మిడ్-ఎస్ యూవీ స్థానాన్ని శ్రేణిలోనే ప్రముఖ ఫీచర్స్ అనగా 26.04 సెం.మీ ఫుల్లీ డిజిటల్ క్లస్టర్ & 26.03 సెం.మీ హెచ్ డీ టచ్ స్క్రీన్ నేవిగేషన్, డ్యూయల్ జోన్ ఫుల్లీ ఆటోమేటిక్ ఎయిర్ కండిషనర్ మరియు R18 46.20 cm క్రిస్టల్ కట్ గ్లాసీ బ్లాక్ అల్లాయ్ వీల్స్ తో డ్యూయల్ స్క్రీన్ పనోరమిక్ డిస్ ప్లేకు నాయకత్వంవహించింది. దీనికి ఎంతగానో ఎదురుచూసిన డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్ రూఫ్ మరియు ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. సమర్థవంతమైన స్మార్ట్ స్ట్రీమ్ జీ 1.5 టీ - GDi పెట్రోల్ ఇంజన్ తో ఇప్పటి వరకు శ్రేణిలోనే అత్యంత శక్తివంతమైన ఆవిష్కరణగా నిలిచింది. ఇది 160 పీఎస్ పవర్ ను మరియు 253 Nm టార్క్ ను ఉత్పన్నం చేస్తుంది. మూడు ట్రిమ్ భావనలలో లభిస్తోంది - టెక్ లైన్, జీటీ లైన్ మరియు ఎక్స్-లైన్ & మూడు ఇంజన్స్ మరియు అయిదు ట్రాన్స్ మిషన్ ఆప్షన్స్ లో లభిస్తున్న సెల్టోస్ భారతదేశపు బయ్యర్స్ కు ఆధునిక కస్టమర్స్ కోసం విస్తృత శ్రేణి ఎంపికలు అందచేస్తోంది.
విజయవంతంగా విడుదలైన సందర్భంగా వ్యాఖ్యానిస్తూ, శ్రీ. తే-జిన్ పార్క్, మేనేజింగ్ డైరక్టర్ మరియు సీఈఓ, కియా ఇండియా ఇలా అన్నారు, “మార్కెట్ లో పోటీయుత ధరలకు ధీటుగా ఆధునిక ఆఫరింగ్స్ తో పరిశ్రమలోనే ప్రమాణాలను నెలకొల్పడానికి మా నిబద్ధత గతంలో శ్రేణుల అభివృద్ధిని ప్రోత్సహించింది మరియు కొత్త సెల్టోస్ ఇదే పోకడను కొనసాగిస్తుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆధునిక ఏడీఏఎస్ లెవెల్ 2, ఉన్నతమైన భద్రతా ఫీచర్స్, మరియు ఆధునిక టెక్నాలజీతో, నేటి అభిరుచి గల ఆధునిక కస్టమర్స్ కు అనుగుణంగా ఉండే ప్రేరేపిత వాహనాన్ని మేము తయారు చేసాం. విస్తృత శ్రేణి వేరియెంట్ ఎంపికలు, ఆకర్షణీయమైన ధర, సమస్యలు లేని యాజమాన్య అుభవంతో, కొత్త సెల్టోస్ స్మార్ట్ డ్రైవింగ్ అనుభవాన్ని ఇవ్వడమే కాకుండా మార్కెట్ లో ఉత్తమమైన కొనుగోలుగా కూడా నిలిచింది.”
తన ఆకర్షణీయమైన డిజైన్, దృఢమైన రూపం మరియు ఆధునిక స్టైలింగ్ తో కొత్త కియా సెల్టోస్ ప్రత్యేకంగా నిలిచింది. ఇది కియా వారి ‘వ్యతిరేకమైనవి ఐక్యమయ్యాయి’ డిజైన్ సిద్ధాంతాన్ని ప్రదర్శిస్తుంది మరియు అందరి దృష్టిని ఆకర్షించే ఆధునికత యొక్క వెలుగును ప్రసరిస్తుంది. భారతదేశం కోసం ప్రత్యేకించి పరిచయం చేయబడిన ప్యూటర్ ఆలివ్ రంగు ఎస్ యూవీ రూపాన్ని మరింత మెరుగుపరిచింది.
ఆటోమోటివ్ నవ్యత ముంది నిలిచిన, కొత్త కియా సెల్టోస్ 17 స్వతంత్ర ఫీచర్స్ తో అత్యంత అభివృద్ధి చెందిన లెవెల్ 2 ఆధునిక డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ఏడీఏఎస్) భద్రతకు కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. ఈ విప్లవాత్మకమైన ఆధునిక టెక్నాలజీలో వివిధ ఇంటిలిజెంట్ ఫీచర్స్ కోసం ఆధునిక ఫార్వర్డ్ కొలిజన్ నివారించే అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్ మరియు స్టాప్ & గోతో స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ సహా 1 కెమేరా మరియు 3 రాడార్స్ తో డ్రైవర్స్ కు, ప్రయాణికులకు ఒకే విధంగా భద్రతను కలిగిస్తాయి. ఈ విలక్షణమైన గ్రేడ్ 6 ఎయిర్ బ్యాగ్స్, హెచ్ఏసీ (హిల్ – స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్), ఈఎస్ సీ (ఎలక్ట్రోనిక్ స్టెబిలిటి కంట్రోల్), మరియు వీఎస్ఎం (వెహికిల్ స్టెబిలిటి మేనేజ్మెంట్) వంటి స్టాండర్డ్ 15 భద్రతా ఫీచర్స్ తో కొత్త సెల్టోస్ దేశంలోనే అత్యంత భద్రత కలిగిన ఎస్ యూవీగా తయారు చేసింది.
కస్టమర్స్ తమకు ఇష్టమైన వేరియెంట్ ను కియా ఇండియా వారి అధికారిక వెబ్ సైట్ www.kia.com/in ద్వారా మరియు రూ. 25,000 ఆరంభపు బుక్కింగ్ మొత్తం చెల్లించడం ద్వారా కియా ఇండియా వారి ఏవైనా అధికారిక డీలర్ షిప్స్ ద్వారా బుక్ చేయవచ్చు