స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా యూత్‌ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ `కృష్ణగాడు అంటే ఒక రేంజ్` ట్రైలర్ విడుదల
ఓ అందమైన పల్లెటూరు. అందులో కృష్ణ అనే చలాకీ కుర్రాడు. పుట్టినప్పటి నుంచి అతనికి తన ఊరితో ఎంతో మంచి అనుబంధం ఉంటుంది. ఆ ఊరే కృష్ణ ప్రపంచం. అలాంటి కుర్రాడి జీవితంలో ఓ అమ్మాయి వస్తుంది. ఎంతో సాఫీగా సాగిపోతున్న అతని జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. తండ్రి కోరికను కృష్ణ ఎలా నేరవేర్చాడు? కృష్ణ అనుకున్న పని సాధించాడా? తన ప్రేమను గెలుచుకున్నాడా? కృష్ణ జీవితంలో తన ఊరితో ఉండే అనుబంధం ఎలాంటిది? అనే విషయాలు తెలియాలంటే `కృష్ణగాడు అంటే ఒక రేంజ్` సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్.
రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'కృష్ణ గాడు అంటే ఒక రేంజ్`. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 4న సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా బుధవారం చిత్ర యూనిట్ ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ ట్రైలర్‌ను విడుదల చేసి సినిమా పెద్ద సక్సెస్ కావాలని చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఎన్నో చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన రాజేష్ దొండపాటి ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు.
ఇప్పటివరకు ఈ సినిమా టీజర్, మూడు సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దీంతో ఈ ఫీల్ గుడ్ ప్రేమ కథపై జనాల్లో క్రేజ్ ఏర్పడింది. కొత్త హీరో హీరోయిన్లను పరిచయం చేస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఓ వైపు యూత్‌కు నచ్చే ఎలిమెంట్స్‌తో పాటు సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలున్నాయి. ఎమోషనల్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఈ సినిమాలో రఘు, స్వాతి పొలిచర్ల, సుజాత, వినయ్ మహదేవ్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తుండగా.. ఎడిటర్‌గా సాయి బాబు తలారి పని చేస్తున్నారు. వరికుప్పల యాదగిరి పాటలు రచించారు. గురి చూసి ఒక్కటే దెబ్బలో కొట్టేస్తా అంటూ రంగంలోకి దిగిన ఈ కృష్ణ గాడు తన రేంజ్ చూపించడానికి ఆగస్ట్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు.
నటీనటులు:
రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ, రఘు, స్వాతి పొలిచర్ల, సుజాత, వినయ్ మహదేవ్ తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్ : శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి
నిర్మాతలు : పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత
ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్: రాఘవేంద్ర రావు
కథ, కథనం, దర్శకత్వం : రాజేష్ దొండపాటి
ఎడిటర్ : సాయి బాబు తలారి
మ్యూజిక్ : సాబు వర్గీస్
డీఓపీ: ఎస్ కె రఫీ
లిరిక్స్ : వరికుప్పల యాదగిరి
పి.ఆర్.ఒ : సాయి సతీష్