తమ డిజిటల్ చెల్లింపుల బ్రాండ్ Amazon Pay కోసం ఒక కొత్త ప్రచారాన్ని ఆవిష్కరించిన అమేజాన్

బ్రాండ్ యొక్క విలువైన  ఆఫరింగ్స్ ప్రదర్శించడం మరియు వినియోగదారులకు దాని వలన కలిగే సౌలభ్యం, అన్ని చోట్ల లభ్యత , సౌలభ్యం మరియు సరసమైన  ధరలను  వివరించడమే ఈ  కాంపైన్ లక్ష్యం.

 
నేషనల్, 18 ఆగస్టు 2023: విలక్షణ బాలీవుడ్ స్టార్ ఆయుష్మాన్ ఖురానా అమెజాన్ వారి బ్రాండ్ అమెజాన్ పే కోసం కొత్త కాంపైన్ - ‘బిల్ పేమెంట్స్ కా స్మార్టర్ వే’ కు ప్రాతినిధ్యంవహిస్తున్నారు. ఆలస్యపు జరిమానాలు మరియు జరిమానాలను నివారించడంలో సహాయపడే తమ బిల్లుల కోసం  సకాలంలో చేసే రిమైండర్‌లతో - కస్టమర్‌లు తమ బిల్స్ అన్నింటినీ ఒకే చోట నిర్వహించే ఆధునిక కాలానికి చెందిన పద్ధతిని ఏ విధంగా ఆనందించాలని ఆలోచనను ప్రధానంగా ఈ కాంపైన్ ప్రచారం చేస్తుంది. వినియోగదారులు అమేజాన్ పే బ్యాలెన్స్ మరియు అమేజాన్ పే లేటర్ ను వినియోగించి సౌకర్యవంతమైన మరియు అత్యంత వేగవంతమైన 1-క్లిక్ బిల్లు చెల్లింపు అనుభవాన్ని కూడా ఆనందించవచ్చు మరియు 5 సెకండ్స్ లోపు బిల్స్  చెల్లించవచ్చు. యూపీఐ మరియు క్రెడిట్ కార్డ్‌ల వంటి తమకు నచ్చిన చెల్లింపు సాధనాన్ని ఉపయోగించి కస్టమర్‌లు  తమ రీఛార్జెస్ మరియు బిల్లుల కోసం చెల్లించే అవకాశం కూడా ఉంది. ఈ ప్రచారంతో, కస్టమర్స్ తమ రోజూవారీ లావాదేవీలు కోసం  అమేజాన్ పే బిల్లు చెల్లింపులు మరియు రీఛార్జ్‌లతో పాటు ఆఫర్‌లు/రివార్డ్స్ తో తక్షణం మరియు  నిరంతర అనుభవాన్ని తెలియజేసే లక్ష్యాన్ని కలిగి ఉంది.

 
మన రోజూవారీ జీవితంలో చేసిన బిల్లు చెల్లింపులు మరియు రీఛార్జెస్ యొక్క సారాంశాన్ని టీవీసీ హాస్యం మరియు ఆకర్షణల మేళవింపుతో ప్రదర్శిస్తుంది. అమేజాన్ పే ద్వారా బిల్స్ మరియు రీఛార్జెస్ ను మరింత సమర్థవంతమైన విధానంలో నిర్వహించడాన్ని తెలివిగా గుర్తించి, ఆ రహస్యాన్ని ప్రేక్షకులకు ఎంతో నాటకీయంగా నాయకుడు ఆయుష్మాన్ వివరిస్తారు. బిల్లు చెల్లింపులు మరియు డీటీహెచ్ / మొబైల్ రీఛార్జెస్, మరియు రోజూవారి సాధారణ ఇంటి పనులు కోసం అమేజాన్ పే యొక్క తెలివైన, నిరంతర సౌకర్యం మధ్య పోలికను ఈ కథనం నైపుణ్యంగా వివరిస్తుంది. జంట మధ్యలో చెప్పని, ఇంకా సంతోషకరమైన హాస్యంలో కథనం యొక్క ప్రధాన అంశం ఆధారంగా నిలిచి సంబంధాన్ని మరియు స్వచ్ఛమైన ఆనందాన్ని పెంపొందిస్తుంది. తమ ఉత్తేజభరితమైన ఆలోచనలను తెలియచేస్తున్నప్పుడు ప్రేక్షకులు తమ నిజ-జీవిత సంబంధాలలో అతి సూక్ష్మమైన విషయాల సంబంధంలో అన్వయించుకోబడతారు. ఈ కాంపైన్ ఇప్పటికే ఉన్న బిల్లు చెల్లింపుదారులను అమేజాన్ పేని  ఉపయోగించేలా  చేయడానికి ఉద్దేశించిన వ్యూహాత్మక ప్రయత్నం. ఇది వారికి  ఉన్నతమైన మరియు  సాటిలేని రోజువారీ బిల్లు చెల్లింపు అనుభవం అందిస్తోంది.

 
ప్రోడక్ట్ గురించి మాట్లాడుతూ, అమెజాన్ పే ఇండియా డైరెక్టర్, యూజర్ గ్రోత్ మరియు సీఎంఓ, అనురాధ అగర్వాల్ ఇలా అన్నారు, “నేటి వేగవంతమైన ప్రపంచంలో, బిల్స్  నిర్వహణ, వాటి యొక్క ప్రతి గడువు తేదీలను గుర్తుంచుకోవడం, గోప్యమైన ఛార్జీలు / జరిమానాలతో పాటు చెల్లించడానికి ఉత్తమమైన వాటిని ఎంచుకునే  మార్గాలు, ఇవన్నీ సమయం తీసుకుంటాయి  మరియు ఇబ్బందికరమైన అనుభవం కలిగిస్తాయి. 'బిల్ పేమెంట్స్ కా స్మార్టర్ వే' అనేది కస్టమర్ల కోసం రీఛార్జ్ మరియు బిల్లు చెల్లింపు అనుభవాన్ని సరళం చేయడానికి మరియు ఆధునీకరించడానికి మేము చేసిన  ప్రయత్నం ఇది. అమేజాన్ పే అటువంటి రోజువారీ లావాదేవీలను క్రమబద్ధీకరించి, వాటిని సులభతరం చేయడానికి, మరింత సురక్షితమైనదిగా, వేగవంతమైనదిగా మరియు 'తెలివిగా' చేయడానికి కట్టుబడింది. మేము కస్టమర్ సమస్యలను, మార్కెట్‌కు అంతరాయం కలిగించే వాటిని పరిష్కరించే పరిష్కారాలను మరియు సాటిలేని చెల్లింపు అనుభవాన్ని ఆనందించడానికి వారిని ప్రోత్సహించే సమగ్రమైన కాంపైన్స్ తీసుకురావడాన్ని కొనసాగిస్తాము.”

 
ఈ కాంపైన్ గురించి మాట్లాడుతూ, IN & EM ప్రైమ్ & మార్కెటింగ్ డైరెక్టర్, రవి దేశాయ్ ఇలా అన్నారు, “బిల్ పేమెంట్స్ కా స్మార్టర్ వే అనే మా  కాంపైన్ బిల్ చెల్లింపుల  వంటి మన రోజువారీ పనులకు మనం  అవలంబించే విధానాన్ని ఒక  తెలివైన ఆలోచన  ఏ విధంగా మారుస్తుందో బాగా ప్రదర్శిస్తుంది.  ప్రోత్సాహకరమైన గాథను చెప్పడంలో చోటు చేసుకున్న హాస్యం నేపథ్యంలో, బిల్స్ చెల్లించడం వంటి సాధారణ పనుల కోసం  అమేజాన్ పే అందించే సమర్థవంతమైన పరిష్కారాలను సృజనాత్మకంగా నిజమయ్యేలా చేయడమే దీని యొక్క ప్రధాన ఆలోచన. ఇది బిల్లులను చెల్లించడానికి మరియు మన రోజువారీ పనులను చేరుకోవడానికి తెలివిగల మార్గాన్ని కనుగొనే అద్భుతమైన కథనాన్ని ఆవిష్కరించింది కాబట్టి ఇది ఇబ్బందికరమైన చెల్లింపు అనుభవాన్ని వదిలివేయడంగా చెప్పవచ్చు.  బహుళ యాప్‌లలో సైన్ అప్ చేయడం ద్వారా కస్టమర్‌లు తమకు తెలియకుండానే  తమ బిల్లు చెల్లింపు ప్రక్రియను క్లిష్టతరం చేసి తరచుగా వచ్చే అసౌకర్యాలను పట్టించుకోరు. ఈ మందకొడితనం నుండి వారిని బయటకు తీసుకు రావడమే మా లక్ష్యం.  అలాంటి  రోజువారీ చెల్లింపులు కోసం  మరియు మరెన్నో వాటికి  అమేజాన్ పేని తెలివైన పరిష్కారంగా గుర్తించమని  కస్టమర్స్ ను అభ్యర్థించారు.

 
అమేజాన్ పేతో గల సంబంధం గురించి మాట్లాడుతూ, ఆయుష్మాన్ ఖురానా ఇలా అన్నారు, “అమేజాన్ పే యొక్క ‘బిల్ పేమెంట్స్ కా స్మార్టర్ వే’ కాంపైన్ లో భాగంగా ఉండటానికి నేను ఆనందిస్తున్నాను. సామర్థ్యం మరియు సౌకర్యానికి విలువనిచ్చే వ్యక్తిగా, ఈ చొరవ నేటి వేగవంతమైన జీవన శైలి అవసరాలతో ఖచ్చితంగా అనుసంధానం అవుతుందని నేను విశ్వసిస్తున్నాను. వివిధ శ్రేణులలో అమేజాన్ పే పై కస్టమర్స్ ఆనందించగలిగే ఇబ్బందిరహితమైన బిల్ చెల్లింపు అనుభవాన్ని ఈ కాంపైన్ ప్రదర్శిస్తుంది. అమేజాన్ పేతో పాటు, సౌకర్యవంతమైన, బహుమానపూరకమైన, నమ్మకమైన చెల్లింపు అనుభవాన్ని అనుసరించడానికి కస్టమర్స్ ను ప్రోత్సహించడానికి నేను ఆనందిస్తున్నాను.”

 

పైన చెప్పినవే కాకుండా ‘బిల్ పేమెంట్స్ కా స్మార్టర్ వే’ బిల్ చెల్లింపులు మరియు రీఛార్జెస్ కోసం గుర్తించదగిన ఉత్పత్తి ఫీచర్స్ ను శ్రేణిని కూడా అందిస్తోంది. అమేజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ తో, కస్టమర్స్ రీఛార్జెస్ మరియు బిల్ చెల్లింపులు పై 2% వరకు అన్ లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ను ఆనందించవచ్చు. ఇంకా, కస్టమర్స్ అలెక్సాను అడగడం ద్వారా తమ బిల్స్ ను శ్రమ లేకుండా కూడా చెల్లించగలరు. ఎలాంటి అదనపు కన్వీనియెన్స్ ఫీజు లేకుండా రీఛార్జెస్ మరియు బిల్ చెల్లింపులు పై అమేజాన్ పే ఈ సౌకర్యాలను అందిస్తోంది. ఇంకా, ప్రతి లావాదేవీతో, ప్రముఖ బ్రాండ్స్ నుండి కస్టమర్స్ స్క్రాచ్ కార్డ్ కూడా గెలుచుకోవచ్చు.

   



More Press News