ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల స్వరూపం మారిపోయాయి: తెలంగాణ మంత్రి పువ్వాడ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న పల్లె ప్రగతి అద్భుత ఫలితాలు ఇచ్చిందని, ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల స్వరూపం మారిపోయాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం రేగులచలక గ్రామంలో నిర్వ‌హించిన పల్లె ప్రగతి ముగింపు కార్యక్రమంకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరైయ్యారు.

తొలుత రేగులచలక గ్రామ పంచాయతీ కార్యలయం ప్రారంభించారు. రేగుల చలుక గ్రామ పంచాయతీ అర్చీను మంత్రి ఆవిష్కరించారు. ముందుగా పల్లె ప్రగతి లో గ్రామాన్ని ఆదర్శంగా నిలుపుతున్న సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ కార్యదర్శులను మంత్రి పువ్వాడ అభినందించారు.అనంతరం పల్లె ప్రగతి సభలో వారు మంత్రి మాట్లాడుతూ పల్లెల్లో పచ్చదనం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తూ ప్రజల భాగస్వామ్యంతో సమస్యలను పరిష్కరించుకునేందుకు ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు పల్లె ప్రగతి కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టార‌న్నారు. గ్రామాభివృద్ధి లక్ష్యాలను నెరవేర్చడం కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు నిబద్ధతతో, కార్యదీక్షతో పనిచేయడం వల్లే నేడు గ్రామాల స్వరూపం మరిపోయాయన్నారు. 

పల్లె ప్రగతిని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు రావటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన హ‌రిత హారం కార్య‌క్ర‌మంలో నాటిన మొక్క‌ల‌ను కొనసాగింపుగా పల్లె ప్రగతిలో నాటిన మొక్కలను సైతం సంర‌క్షించాల్సిన భాద్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌న్నారు. నాటిన మొక్కలకు నీటి వసతి, రక్షణ వలయాలు, నర్సరీల సంరక్షణ, నర్సరీల నిర్వాహణ, డంపింగ్ యార్డ్, వైకుంటాధమం తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. పల్లె ప్రగతిలో నిర్దేశించిన పనులు పూర్తి చేసుకోవాలని, నిర్ల‌క్ష్యం చేసిన వారిపై తగు చర్యలు త‌ప్పావ‌న్నారు. ఇంట్లో వినియోగించుకుని బయటకు పోయే నీరును నిల్వ చేసుకోవడం మహత్కార్యం. అందుకే ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మాణం చేసుకోవాలన్ని గ్రామ ప్రజలకు సూచించారు.

గ్రామాల్లో ప్రజలను నిరంతరం చైతన్య పరిచే బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులు తీసుకోవాలని చెప్పారు. అభివృద్ధి అంటే కేవలం సిసి రోడ్లు మాత్రమే కాదు. అన్ని ప్రజాప్రతినిధులు అధికారుల వెనక పడాలి, పనులు చేయించుకోవాలని అప్పుడే అభివృద్ధి చేసుకోడానికి ప్రజలు మీకు సహకరిస్తారు, అనుసరిస్తారని తెలిపారు. గ్రామ అవసరాల దృష్ట వైకుంఠధామంను తప్పనిసరిగా నిర్మించుకోవాలి. పాలేరు జలాశయానికి గోదావరి జలాలను తీసుకొచ్చేందుకు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అద్భుతం. అదే తరహాలో సీతారామ కూడా రైతుల పాలిట వరప్రదాయని కానుంది అని పేర్కోన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ద్వారా రాష్ట్రంలో పంటలు విస్తారంగా పండినందున రాష్ట్రం ధాన్యబండగారంగా మారిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గ్రామ సభ అనంతరం రేగుల చలకలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిభిరాన్ని మంత్రి ప్రారంభించారు.

ఈ  కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, DRDO ఇందుమతి, DPO శ్రీనివాస్, AMC చైర్మన్ వెంకటరమణ వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు ఉన్నారు.


More Press News