Amazon.inతో కలిసి పండుగ సీజన్‌ను వేడుకచేద్దాం

మన జీవన ప్రయాణంలో అనుబంధాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది - మీ సోదరుడికి రాఖీ కట్టడం కావచ్చు, వృద్ధాప్యంలో ఉన్న మీ తల్లితండ్రుల కోసం ఆలోచనాత్మక సంజ్ఞలు చేయడం లేదా మీ చిన్నారి లేదా మీ తల్లిదండ్రుల అవసరాలు చూసుకోవడం కావచ్చు - ఇతరుల గురించి మనం ఎల్లప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాము. అయితే, ఇతరుల మీద మనం నిరంతర ప్రేమ వ్యక్తీకరించినప్పటికీ, మన గురించి మాత్రం మనం నిర్లక్ష్యం చేస్తుంటాము. అందుకే, Amazon.in వారి ఇటీవలి ప్రచార వీడియో చూస్తే, అది మనకి సంబంధించినదిగా అనిపిస్తుంది - #KhushiyanApnoKiAurApniBhi. ఈ ప్రచార వీడియో ఒక సరైన నినాదం అందిస్తుంది - ప్రతిఒక్కరి (‘మనం’ మరియు ‘నేను’ ) సంతోషం నెరవేరినప్పుడే వేడుకలకు జీవం వస్తుంది! కాబట్టే, స్వీయ-ప్రేమ అమూల్యమైనదని మరియు స్వార్థమనే పేరుతో ఆ అందమైన అవసరాన్ని నిర్లక్ష్యం చేయకూడదని అన్ని పండుగల సమయంలో ఈ ప్రచారం గుర్తు చేస్తుంది.


ఈ ప్రచార వీడియోఒక తల్లి మరియు ఆమె కుమార్తె మధ్య మనోహర క్షణాన్ని వర్ణిస్తుంది. ఇందులో, తల్లి తన కుటుంబం కోసం బహుమతులు ప్యాక్ చేయడంలో బిజీగా ఉంటుంది. ‘మరి, నీకోసం? ఏం తీసుకోలేదా!’ అని అంటూ, నీ కోసం కూడా ఏదైనా తీసుకోవాలంటూ ఆ కుమార్తె తన తల్లిని కోరుతుంది. హృదయానికి హత్తుకునే సన్నివేశంతో ఈ వీడియో ముగుస్తుంది.



ఇలాంటి మరిన్ని సన్నివేశాల కోసం, సోషల్ మీడియా వేదికల్లో మేము ఒక పోటీ నిర్వహించాము మరియు #KhusiyanApnoKiAurApniBhi కథనాలు పంచుకోవాల్సిందిగా అందులో పాల్గొనే వారి నుండి ఎంట్రీలు ఆహ్వానించాము. కుటుంబ కథలు మొదలుకొని స్పూర్తిదాయక వ్యక్తిగత ప్రయాణాల వరకు, అనేక ఎంట్రీలు వచ్చాయి. ప్రియమైన వారితో పాటు తమకోసం కూడా బహుమతుల కొనుగోలు చేసినప్పుడే వేడుకలు సజీవంగా మారుతాయనే స్పష్టమైన విషయాన్ని ఆ ఎంట్రీలు కళ్లకు కట్టాయి. వాటిలో కొన్ని కథలు యూట్యూబ్లోని కామెంట్లలో పంచుకోబడ్డాయి. అవి మన ముఖాల మీద చిరునవ్వులు పూయిస్తాయి.

·       ఈ పండుగ సీజన్‌లో, ఇతరులకు బహుమతులు ఇవ్వడంలోని నిజమైన ఆనందాన్ని ఆస్వాదించాలనుకున్నాను. నాకు నేను ఇచ్చుకోవడం కూడా అందులో ఉంటుంది. మా ఇంటిని అలంకరించడం మరియు రుచికరమైన వంటకాలు తయారు చేయడంతో పాటు, 'నాకోసం’ కూడా నేను సమయం కేటాయించాను. నిన్న సాయంత్రం, కొవ్వొత్తుల నుండి వచ్చే సుతిమెత్తటి కాంతి మా గదిలో పరచుకునే సమయంలో, నా మీద నా-ప్రేమ అనే సరళమైన మరియు గాఢమైన పనిలో మునిగిపోవాలని నేను నిర్ణయించుకున్నాను. ఒక కప్పు మసాలా టీని రుచిచూస్తూ, పాత ఉత్తరాలను చదవడంతో పాటు అనేక ఏళ్ల జ్ఞాపకాలతో నిక్షిప్తమైన ఫోటో ఆల్బమ్‌ చూస్తూ కూర్చున్నాను. టీని మెల్లగా చప్పరిస్తూ, గత పండుగల సమయంలో కుటుంబం మరియు స్నేహితులతో నేను పంచుకున్న అందమైన క్షణాలను గుర్తుచేసుకున్నాను. గత ఏడాది మా అమ్మ మాకు దూరమైంది. అందుకే, ఆమె ఫోటోలు చూస్తున్నప్పుడు నాలో భావోద్వేగం చోటుచేసుకుంది. అయితే, అదేసమయంలో, అనేక ఏళ్లుగా ఆమెతో కలసి మేము జరుపుకొన్న పండుగ జ్ఞాపకాలతో పాటు మా సంతోషాల్లో ఆమె ప్రాముఖ్యత సంతోషం కలిగించాయి.

·       ఒక కొత్త గిటార్ కొనాలనే ఆలోచన నా కోరికల జాబితాలో అలాగే ఉండిపోయింది. ఎట్టకేలకు, నేను దాన్ని కొనుగోలు చేశాను. సాయంత్రం వేళల్లో తీరిగ్గా కూర్చుని, దానిమీద రాగాలు నేర్చుకోవడం అద్భుతంగా ఉంది. గత దీపావళి సందర్భంగా, కుటుంబ సభ్యులందరూ ఒకే చోటుకి చేరిన సమయంలో, వారికి ఇష్టమైన పాటలు ప్లే చేసి అందరినీ ఆశ్చర్యపరిచాను. వారి ముఖాల మీద కనిపించిన ఆ నవ్వులు నాలోని ఆనందాన్ని ప్రతిబింబించాయి!

·       ప్రతి ఆదివారం, నా చిన్న చిన్న కోరికలు పూర్తి చేసుకోవడానికి, ఆ సెలవు రోజున నాకంటూ కొంచెం సమయం కేటాయించడం కోసం కొన్నిసార్లు ఒక సన్‌ఫ్లవర్, కొన్నిసార్లు ఒక చాక్లెట్ లేదా మరేదైనా ఒకదానిని ఎంచుకుంటున్నాను. ప్రతిఒక్కరినీ సంతోషపెట్టడం కోసం నేను తీవ్రంగా ప్రయత్నిస్తుంటాను. అలాగే, ఈ ఒక్క రోజుని నేను నా కోసం ఎంచుకున్నప్పుడే, మిగిలిన రోజులన్నీ మరింత మెరుగ్గా ఉంటాయి.

·       నేనొక ఫుల్-టైమ్ కంటెంట్ క్రియేటర్‌ని మరియు ఫిట్‌నెస్ మీద మక్కువ కూడా ఉంది. పగలంతా నేను షూట్‌లకు వెళ్లినప్పటికీ, రాత్రిళ్లు జిమ్‌లో గడుపుతాను. ఇలాంటి తీరికలేని రొటీన్ మధ్య కూడా, ఒంటరిగా బనారస్‌కు ప్రయాణించాలని నిర్ణయించుకున్నాను. ఈ స్నాప్‌షాట్‌లనే పోస్ట్ కార్డులుగా నా కుటుంబ సభ్యులకు పంపాను. నేను ఎల్లప్పుడూ వారి గురించి ఆలోచిస్తూ ఉంటానని అవి వారికి గుర్తు చేస్తాయి. ఆ ట్రిప్ నా మనస్సుకి కొత్త ఉత్సాహం అందించింది. సహజ సౌందర్యాన్ని కళ్లకి కట్టడంతో పాటు నేను ఆస్వాదించిన ఆనందాన్ని నా ప్రియమైన వారితో పంచుకోవడానికి నన్ను అనుమతించింది.

'అందరికోసం' క్షణాలను ఆస్వాదించే సమయంలో, కొంచెం 'నేను' సమయం కూడా ఆస్వాదించడం మర్చిపోకండి. ఈ వేడుకలో మీరూ పాల్గొనండి మరియు మీకు ఇష్టమైన వాటితో మీ కార్ట్‌ నింపేయండి - ఎందుకంటే, ఈ ఆనందానికి అందరితో పాటు మీరు కూడా అర్హులే! 




More Press News