మెడ్లైన్ డయాగ్నస్టిక్ ల్యాబ్స్ హైదరాబాదులో 20కి పైగా అంటువ్యాధులకు ఆర్టి–పిసిఆర్ పరీక్షలను ప్రవేశపెట్టింది
హైదరాబాదు వాస్తవ్యులు ఇప్పుడు అనేక వ్యాధులకు ఖచ్ఛితమైన ఆర్టి-పిసిఆర్ పొందవచ్చు
హైదరాబాదు, October 5, 2023 – అత్యాధునిక మరియు సరసమైన డయాగ్నస్టిక్స్ యొక్క ఒక కొత్త శకము ఇప్పుడు హైదరాబాదులో ప్రారంభం అయ్యింది. నగరములోని మరియు స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ లాబొరేటరీ అయిన మెడ్లైన్ డయాగ్నస్టిక్స్ ల్యాబ్స్, మరింత ఖచ్ఛితమైన పరీక్ష రిపోర్ట్స్ కొరకు ఆర్టి-పిసిఆర్ పరీక్షల సమగ్ర శ్రేణిని ప్రవేశపెట్టింది. మైల్యాబ్ ద్వారా హెల్త్‌టెక్ భాగస్వామ్యాన్ని స్థాపించడం ద్వారా, హైదరాబాదులో హెచ్ఐవి, హెపటైటిస్ సి మరియు బి, బ్లడ్ డోనర్ పరీక్ష, క్షయ, చికన్‌గున్యా, డెంగ్యూ, మలేరియా మరియు వివిధ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ మరియు జన్యుపరమైన వ్యాధుల వంటి అనేక వ్యాధుల కొరకు ఆర్టి-పిసిఆర్ పరీక్షలను అందించే మొదటి ల్యాబ్ గా మెడ్లైన్ డయాగ్నస్టిక్ ల్యాబ్స్ అవుతుంది.
మెడ్లైన్ డయాగ్నస్టిక్ ల్యాబ్స్ తో మైల్యాబ్ నుండి ఆధునిక డయాగ్నస్టిక్ యంత్రాలు ఉన్నాయి మరియు ఖచ్ఛితమైన మరియు సకాలములో ఫలితాలను అందించే అత్యధిక నైపుణ్యం కలిగిన వృత్తినిపుణుల బృందం ఉన్న సిబ్బంది ఉన్నారు. దీని వలన నగరములో నివసించే వారు, దూరప్రాంతాలకు ప్రయాణించే పనిలేకుండా, అవసరమైన పరీక్షలను తక్షణమే మరియు సమర్థవంతంగా చేయించుకోగలుగుతారు. అంతేకాకుండా, రోగులు వేచి ఉండే సమయము తక్కువ అవుతుంది, తద్వారా ఆరోగ్య సంరక్షకులు రోగనిర్ధారణ వేగంగా చేసి తగిన చికిత్స ప్రణాళికలను ప్రారంభించగలుగుతారు.
డా. వేణు గంజి, మెడ్లైన్ డయాగ్నస్టిక్ ల్యాబ్స్ యజమాని , ఇలా అన్నారు, “మైల్యాబ్ ద్వారా హెల్త్‌టెక్ భాగస్వామ్యం మా సమీపప్రాంతాలలోని వారి జీవితాలపై అపారమైన ప్రభావాన్ని చూపుతుంది. మాలిక్యులార్ కు అప్గ్రెడేషన్ మావైపు నుండి ప్రజలకు సమగ్రమైన మరియు యాక్సెసిబుల్ ఆరోగ్యసంరక్షణ సేవలను అందించుటకు వేసిన ఒక గణనీయమైన ముందడుగు . ఇక్కడ ఉన్నవారు, మన సమాజము యొక్క సంక్షేమము మరియు ఆరోగ్యము పట్ల మా నిబద్ధతను నొక్కిచెప్పే మా పరీక్షా సేవల సౌకర్యాన్ని మరియు విశ్వసనీయతను వినియోగించుకోవాలని మేము ఆహ్వానిస్తున్నాము..”
డా. డి. అంజని కుమారి, MBBS, DGO, DNB అబ్స్టెట్రిక్స్ & గైనకాలజి, ఇన్ఫర్టిలిటి నిపుణురాలు ఇలా అన్నారు, “అంటువ్యాధుల పరీక్షల విషయానికి వస్తే మాలిక్యులార్ డయాగ్నస్టిక్స్ అనేది రోగనిర్ధారణ సాంకేతికతలో చాలా కీలకమైనది. భారతదేశములో, హెచ్ఐవి మరియు వైరల్ హెపటైటిస్ చాలా తీవ్రమైన ప్రజా ఆరోగ్య సమస్యలు. హెచ్ఐవి, హెచ్బివి ,హెచ్సివి, హెచ్ఏవి ఆర్టి–పిసిఆర్ పరీక్షల కొరకు మైల్యాబ్ వారి మేడ్-ఇన్-ఇండియా ఆర్టి–పిసిఆర్ పరీక్ష కిట్ల శ్రేణి భారతదేశములో ఈ వ్యాధుల భారాన్ని గణనీయంగా తగ్గంచడములో సహాయపడతాయి .”
‘మైల్యాబ్ ద్వారా హెల్త్‌టెక్ భాగస్వామ్యం’ దేశములో మారుమూల ప్రాంతాలకు డయాగ్నస్టిక్స్ యాక్సెసిబుల్ చేయటానికి మాలిక్యులార్ డయాగ్నస్టిక్స్ ల్యాబ్ ఏర్పాటు చేయడములో వ్యవస్థాపకులకు సాధికారతను అందించుటకు చేసే ఒక ప్రయత్నము. ల్యాబ్ యజమానులు మరియు వైద్యులు రోగులకు త్వరితమైన మరియు నాణ్యమైన రోగనిర్ధారణ ఫలితాలను అందించగలుగుతారు, తద్వారా కోరుకున్న వైద్యసంబంధ ఫలితాలు పొందవచ్చు. వాళ్ళు రోగుల శాంపిల్స్ ను ఆధునిక ల్యాబ్స్ కు పంపించవలసిన పని ఉండదు, దీని వలన సమయము మరియు ఖర్చు ఆదా అవుతాయి.