సుమ క‌న‌కాల సేవా సంస్థ ఫెస్టివల్స్ ఫ‌ర్ జాయ్ చొర‌వ‌తో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (TFJA) కు రూ.5 ల‌క్ష‌ల విరాళాన్ని అందించిన నార్త్ అమెరికా తెలుగు సంఘం (NATS)

టాలీవుడ్ స్టార్ యాంక‌ర్ సుమ క‌న‌కాల‌.. 2021లో సినీ ఇండ‌స్ట్రీలో ఇబ్బందులు ప‌డుతున్న మ‌హిళ‌ల‌కు అండ‌గా నిలుస్తూ సేవా కార్య‌క్ర‌మాల‌ను చేయ‌టానికి ఫెస్టివల్స్ ఫ‌ర్ జాయ్ అనే సేవా సంస్థ‌ను ప్రారంభించారు. అప్ప‌టి నుంచి ఈ సంస్థ స‌మాజ శ్రేయ‌స్సులో త‌న వంతుగా భాగం అవుతోంది. 

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(TFJA).. సభ్యుల సంక్షేమం నిరంతరం కృషి చేస్తోన్న సంఘం. సంఘ సభ్యుల ఆరోగ్యం, కుటుంబ సభ్యుల బాగోగులను చూస్తూ ప్రతి సంఘ సభ్యుడికీ ఇంటి పెద్దలా అండగా నిలుస్తూ వస్తోంది టిఎఫ్‌జేఏ. ఇందులో చేరిన ప్రతి సభ్యుడి కుటుంబానికి రూ. 3 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యంతో పాటు ప్రతి సభ్యుడికి 15 లక్షలు టర్మ్ పాలసీ మరియు 25 లక్షలు యాక్సిడెంటల్ పాలసీలను అందిస్తోంది. ఇందుకోసం పరిశ్రమ సహాయ సహకారాలతో పాటు అందరి సభ్యుల తోడ్పాటును తీసుకుంటోంది. 

సినీ ఇండస్ట్రీ కష్టసుఖాల్లో అండగా నిలుస్తూ ఎల్ల‌ప్పుడూ త‌న మ‌ద్ధ‌తుని తెలియ‌జేస్తోన్న తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ గురించి యాంక‌ర్ సుమ విష‌యాన్నినాట్స్‌కు తెలియ‌జేశారు. దీనికి ఉత్త‌ర అమెరికా తెలుగు సంఘం (NATS) వారు వెంట‌నే స్పందించి సుమ క‌న‌కాల సేవా సంస్థ ఫెస్టివల్స్ ఫ‌ర్ జాయ్ ద్వారా టీఎఫ్‌జేఏకు రూ.5 ల‌క్ష‌ల విరాళం అందించారు. 

NATS విరాళాన్ని సుమ క‌న‌కాల గారు తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వై.జె.రాంబాబు, ట్రెజరర్ నాయుడు సురేంద్ర కుమార్ మరియు ఇతర అసోసియేషన్ సభ్యులు లకు అందచేశారు.  ఈ సంద‌ర్భంగా...ఉత్త‌ర అమెరికా తెలుగు సంఘం (NATS) ఉపాధ్య‌క్షుడు మ‌ద‌న్ పాముల‌పాటి మాట్లాడుతూ ‘‘భాషే రమ్యం.. సేవే గమ్యం అనే లక్ష్యంతో నాట్స్ ముందుకు వెళుతుంటుంది. సేవే గమ్యంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్య‌క్ర‌మాల్లో నాట్స్ త‌న‌వంతు భాగ‌మ‌వుతుంది. విద్యార్థుల కోసం స్కూల్ భ‌వ‌నాల‌ను నిర్మించి ఇవ్వ‌టం, అంగ‌న్‌వాడీ సెంట‌ర్స్‌, ఓల్డేజ్ హోమ్స్‌, తాగునీటిని అందించ‌టానికి ప్యూరిఫైయ‌ర్స్ స‌ర్వీసుల‌ను అందిస్తుంటాం. గోకుల్ అచ్చ‌న ఆర్గ‌నైజేష‌న్ ఫ‌ర్ వీక‌ర్ సెక్ష‌న్‌, ఫెస్టివ‌ల్ ఫ‌ర్ జాయ్ వంటి తెలుగు సంస్థ‌ల‌తో క‌లిసి ఈ సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తుంటాం. ఈ ఏడాది న్యూ జెర్సీలో జ‌రిగిన అమెరికా తెలుగు సంబ‌రాల్లో నుంచి ఫండ్స్ క‌లెక్ట్ చేశాం. ‘సంబరంలో సేవ‌.. సంబ‌రంతో సేవ‌’ అనే నినాదంతో కలెక్ట్ చేసిన ఫండ్స్ నుంచి  ఆరు లక్ష‌ల డాల‌ర్స్‌ను సేవా కార్య‌క్ర‌మాల కోసం ఖర్చు చేస్తున్నాం. అందులో భాగంగా ఫెస్టివల్ ఫర్ జాయ్, సుమ కనకాలగారితో కలిసి తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోషియేషన్ వారికి నాట్స్ తనవంతు సహకారాన్ని అందించనుంది. ఇందులో మ‌మ్మ‌ల్ని భాగం చేసిన సుమ క‌న‌కాల గారికి ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేస్తున్నాను’’ అన్నారు. 

అలాగే నాట్స్ మెంబర్స్ సెహ్మదాలి మాట్లాడుతూ ‘‘‘సంబరంలో సేవ‌.. సంబ‌రంతో సేవ‌’ అనేది మా నాట్స్ నినాదం. అందులో భాగంగా ఇటీవ‌ల జ‌రిగిన అమెరికా తెలుగు సంబ‌రాల్లో వ‌చ్చిన ఫండ్స్ నుంచి అన్నింటినీ ఖ‌ర్చు పెట్ట‌కుండా 25 శాతాన్ని సేవాకార్య‌క్ర‌మాల‌కు వినియోగించాల‌నుకున్నాం. ఆ స‌మ‌యంలో సుమ‌గారి ఫెస్టివ‌ల్ ఫ‌ర్ జాయ్ సంస్థ వార‌ధిగా నిలిచారు. తెలుగు ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్ గురించి సుమ‌గారు మాకు వివ‌రించారు. దాని కోసం మావంతు స‌హ‌కారాన్ని అందిస్తున్నాం. అందుకు సుమ‌గారికి ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేస్తున్నాం’’ అన్నారు. 

నాట్స్ మెంబ‌ర్స్ శ్రీధర్ అప్పసాని, అరుణ గంటి, బాపు నూతి, ప్రశాంత్ పిన్నమనేనిలతో పాటు  ఫెస్టివల్ ఫర్ జాయ్‌తో కలిసి వర్క్ చేస్తున్న నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాజ్ అల్లాడకు టీఎఫ్‌జేఏ స‌భ్యులు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేశారు.


       

More Press News