రామ్‌చరణ్ సినిమాతో నా కోరిక తీరబోతుంది: డ్రెస్ డిజైనర్ ఏకాంబరమేగన్
- ఆర్సీ 16తో తెలుగులోకి డ్రెస్ డిజైనర్‌గా ఎంట్రీ ఇస్తున్న ఏకాంబరమేగన్
- రామ్‌చరణ్‌తో పనిచేయడం ఎక్జ్సయింటింగ్ వుందని వ్యాఖ్య
- వచ్చే నెలలో సెట్స్ మీదకు ఆర్సీ 16
ఇక, ఈ చిత్రం గురించి వస్తున్న అప్డేట్స్ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. గ్రామీణ నేపథ్యంలో పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే ఈ సినిమాలో రామ్‌చరణ్ ఓ స్పోర్ట్స్ పర్సన్‌గా కనిపించబోతున్నారని తెలిసింది. ఏఆర్రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రంలో కనిపించబోయే మేకోవర్ కోసం రామ్‌చరణ్ ప్రత్యేక శిక్షణలో వున్న ఫోటో ఒకటి బయటికొచ్చిన సంగతి తెలిసిందే. బీస్ట్ మోడ్ ఆన్ అనే క్యాప్షన్‌తో వచ్చిన ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి మరో టాలెంటెడ్ టెక్నిషియన్ యాడ్ అయ్యారు. తమిళంలో ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ గా రాణిస్తున్న ఏకాంబర మేగన్ ఈ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
ఈ విషయాన్ని ఆయన తన సోషల్‌మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశాడు. ''టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా వుంది. ఇలాంటి క్షణం కోసం ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్నాను. ఎట్టకేలకు నా కోరిక తీరబోతుంది. నాకు ఇలాంటి అద్భుతమైన అవకాశం కల్పించిన బుచ్చిబాబు సానకు నా ధన్యవాదాలు. రామ్‌చరణ్ గారితో కలిసి వర్క్ చేస్తున్నాననే ఫీలింగ్ నాలో ఉత్సుకతను కలిగిస్తోంది. కోలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు ఈ సినిమాతో జరిగే ఈ నా ప్రయాణంలో ఎన్నో కొత్త విషయాలు వెలికితీసే అవకాశం, తెలుగు నేటివిటిని గురించి మరింత తెలుసుకునే చాన్స్ రావడం ఆనందంగా వుంది. ఆర్సీ 16 ప్రాజెక్ట్‌కు పనిచేయడం సంతోషంగా వుంది' అంటూ ఏకాంబరమేగన్ తన ఇన్‌స్టా అకౌంట్లో రాసుకొచ్చారు. దీంతో పాటు బుచ్చిబాబు సానతో దిగిన ఓ ఫోటోను ఆయన షేర్ చేశారు.