తిరుమల శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
- తిరుమల కొండపై ఓ మోస్తరు రద్దీ
- భక్తులతో నిండిన 18 కంపార్ట్మెంట్లు
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,077 మంది భక్తులు
- హుండీ ద్వారా రూ.3.47 కోట్ల ఆదాయం
నిన్న (ఏప్రిల్ 15) ఒక్కరోజే 77,077 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. 27,241 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ.3.47 కోట్ల ఆదాయం లభించింది.