తిరుమలలో భక్తుల రద్దీ.. ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.43 కోట్లు
- బుధవారం శ్రీవారిని దర్శించుకున్న 65,354 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 25,550 మంది యాత్రికులు
- సర్వదర్శనానికి 8 గంటల సమయం, 5 కంపార్ట్మెంట్లలో నిరీక్షణ
బుధవారం నాడు 25,550 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ద్వారా ఒక్కరోజే రూ.4.43 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 5 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వివరించారు.