తెలంగాణలోని ఈ 11 జిల్లాల్లో నేడు బయట అడుగుపెట్టొద్దు!
- గురువారం వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా 17 మంది మృతి
- పలుచోట్ల 46.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు
- నల్గొండలో పొలంలో మంటల్లో చిక్కుకుని రైతు సజీవదహనం
- కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం
తెలంగాణను భానుడు చెలరేగిపోతున్నాడు. నిప్పుల కొలిమిలా మారిన రాష్ట్రంలో ఎండల తీవ్రత రానున్న రోజుల్లో మరింత పెరగనుంది. శుక్రవారం రాష్ట్రంలోని 11 జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది.
గురువారం రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరగా, వడదెబ్బ కారణంగా ఒక్కరోజే 17 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాల్లో నలుగురు చొప్పున, కరీంనగర్‌లో ముగ్గురు, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృత్యువాత పడ్డారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాలలో అత్యధికంగా 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అనేక ఇతర ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి.
ఎండల తీవ్రత ఒకవైపు అయితే.. అగ్నిప్రమాదాలు మరోవైపు పెను విషాదాన్ని మిగుల్చుతున్నాయి. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో వరి కొయ్యలకు నిప్పుపెడుతూ ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుని నూనెముంతల సత్తయ్య (72) అనే రైతు సజీవదహనమయ్యాడు. మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో పంట పొలాలకు నిప్పంటుకోవడంతో వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. హైదరాబాద్ పాతబస్తీలోని ఓ దుస్తుల దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు రూ. 2 కోట్ల ఆస్తి నష్టం సంభవించింది.
ఎండల తీవ్రతకు మనుషులే కాదు, మూగజీవాలు కూడా బలైపోతున్నాయి. రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని కోళ్ల ఫారాల్లో వేడికి తట్టుకోలేక వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల వల్ల కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఒకవైపు భరించలేని ఎండలు, మరోవైపు అకాల వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.