తెలంగాణకు చంద్రబాబు లాంటి నాయకుడి దిశానిర్దేశం అవసరం: మహానాడులో జ్యోత్స్న

Chandrababu Naidu Leadership Needed for Telangana Says Jyotsna
  • తెలంగాణకు టీడీపీ అవసరం ఉందన్న మహిళా నాయకురాలు
  • లోకేశ్ వంటి డైనమిక్ లీడర్ తెలంగాణకు కావాలని అభిప్రాయం
  • 22 ఏళ్లుగా టీడీపీ అధికారంలో లేకున్నా జెండా పట్టుకుని నిలబడ్డామని వ్యాఖ్య
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు లాంటి నాయకుడి దిశానిర్దేశం అవసరమని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న అన్నారు. మహానాడు సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణకు టీడీపీ అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు నారా లోకేశ్ వంటి యంగ్ డైనమిక్ లీడర్ కావాలని అన్నారు. లోకేశ్ ఏపీ విద్యా శాఖ మంత్రిగా ఉన్నారని, కానీ తెలంగాణలో విద్యా శాఖకు ప్రత్యేక మంత్రి లేరని విమర్శించారు.

తెలంగాణలో 22 ఏళ్లుగా టీడీపీ అధికారంలో లేకపోయినా తాము పార్టీని వీడకుండా జెండా పట్టుకుని నిలబడ్డామని పేర్కొన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. మహానాడులో భాగంగా తెలంగాణ విద్యాభివృద్ధి అనే తీర్మానాన్ని ఆమె ప్రవేశపెట్టారు.

ప్రజలకు సామాజిక న్యాయాన్ని దివంగత ఎన్టీఆర్ కల్పిస్తే, ఆ తర్వాత చంద్రబాబు విస్తృత అవకాశాలు ఇచ్చారని పేర్కొన్నారు. నారా లోకేశ్ భవిష్యత్తు నైపుణ్యాన్నితీర్చిదిద్దుతున్నారని అన్నారు. దానిని తెలంగాణకు కూడా ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు. తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీని పారదర్శకంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం భర్తీ చేయాలని జ్యోత్స్న డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Telangana
TDP
Nara Lokesh
Mahanadu
Tirunagari Jyotsna
Telugu Desam Party

More Telugu News