జైలు నుంచి విడుదలైన పాస్టర్ అభినయ్ దర్శన్

Abhinay Darshan Released from Jail Says He is Like a Wounded Lion
  • తాను గాయపడిన సింహాన్ని అంటూ దర్శన్ వ్యాఖ్యలు
  • 8 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న క్రైస్తవ మత ప్రచారకుడు
  • పోలీసులు, జైలు సిబ్బంది గౌరవంగా చూసుకున్నారని వెల్లడి
తనపై తానే దాడి చేయించుకుని మతాల మధ్య విద్వేషాలను రేకెత్తించేందుకు యత్నించాడనే ఆరోపణతో అరెస్ట్ అయిన క్రైస్తవ మత ప్రచారకుడు అభినయ్ దర్శన్ నర్సీపట్నం సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. 8 రోజుల పాటు జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైలు నుంచి విడుదల అయిన తర్వాత ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

పోలీసులు, జైలు సిబ్బంది తనను గౌరవంగా చూసుకున్నారని దర్శన్ తెలిపారు. విచారణలో కూడా మర్యాదగా వ్యవహరించారని... తనపై చేయి చేసుకోలేదని చెప్పారు. జైల్లో కూడా జైలు సిబ్బంది, ఖైదీలు తనను ఇబ్బందులకు గురి చేయలేదని తెలిపారు. 

తన పాదయాత్ర ఆగిపోతుందంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ... పాదయాత్రకు విరామం ఉండదని, పాడేరు నియోజకవర్గం నుంచే పాదయాత్రను కొనసాగిస్తానని తెలిపారు. తాను గాయపడిన సింహం వంటి వాడినని... మరింత కసితో వేట మొదలు పెదతానని అన్నారు. ప్రజల కోసం పోరాటానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని చెప్పారు.

Go Back to Shorts
Abhinay Darshan
Abhinay Darshan arrest
Narsipatnam sub jail
Christian preacher
Padayatra
Paderu constituency
Religious Harmony
Andhra Pradesh Police

More Telugu News