యువతకు అవకాశాల వెల్లువ.. నైపుణ్యాలతో సిద్ధంగా ఉండండి: జెన్-జీతో మంత్రి లోకేష్
- రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నామన్న మంత్రి లోకేష్
- అవకాశాలకు అనుగుణంగా యువతను నైపుణ్య వనరులుగా తీర్చిదిద్దుతాం
- సోషల్ మీడియాలోని ఫేక్ కంటెంట్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచన
- విజయానికి దగ్గరి దారులు లేవని, కష్టపడితేనే ఫలితం ఉంటుందన్నారు
- యువత రాజకీయాల్లోకి రావాలని, టీడీపీ అవకాశాలు కల్పిస్తుందని పిలుపు
యువత అంకితభావం, సమష్టి కృషి, త్యాగనిరతి వంటి గుణాలను అలవర్చుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, వాటిని అందిపుచ్చుకునేందుకు యువతను నైపుణ్యం కలిగిన మానవ వనరులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మహానాడు సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో "జెన్-జీ" యువతతో ఆయన ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యువత అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ, రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వ దార్శనికతను వివరించారు.
క్లస్టర్ విధానంతో పారిశ్రామిక ప్రగతి
రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రజా ప్రభుత్వం క్లస్టర్ ఆధారిత విధానంతో ముందుకు సాగుతోందని లోకేష్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 22 పారిశ్రామిక క్లస్టర్లను గుర్తించామని, డేటా, ఐటీ, క్వాంటం టెక్నాలజీ, రాయలసీమలో ఆటోమోటివ్, కర్నూలులో పునరుత్పాదక ఇంధన వనరుల వంటి రంగాల్లో ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. దీనివల్ల ఒకేచోట ప్రధాన పరిశ్రమలతో పాటు, వాటికి అవసరమైన అనుబంధ పరిశ్రమలు, విడిభాగాల తయారీ యూనిట్లు ఏర్పాటవుతాయని, తద్వారా పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ (ఎకోసిస్టమ్) నిర్మితమవుతుందని అన్నారు.
"రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్, రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలి" అని ఆయన సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠ్యప్రణాళికలో మార్పులు తెచ్చి, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందిస్తామన్నారు.ః
సోషల్ మీడియా ఫేక్ కంటెంట్‌పై అప్రమత్తత అవసరం
సోషల్ మీడియాలో వ్యాప్తి చెందే తప్పుడు సమాచారం పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని లోకేష్ హెచ్చరించారు. డీఎస్సీ విషయంలో ప్రతిపక్ష నేత నిరాధార ఆరోపణలు చేసి లక్షలాది మంది యువతను ఆందోళనకు గురిచేశారని విమర్శించారు. "మేం పారదర్శకంగా 150 రోజుల్లో డీఎస్సీ ప్రక్రియను పూర్తిచేశాం. సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా, వాస్తవాలను సరిచూసుకోవాలి," అని ఆయన యువతకు హితవు పలికారు.
విజయానికి దగ్గరి దారులు లేవు
కష్టపడటం ఒక్కటే విజయానికి మార్గమని, దానికి దగ్గరి దారులు ఉండవని లోకేష్ తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. "నేను మా నాన్నగారితో పోటీ పడాలంటే ఆయన కంటే ఎక్కువ కష్టపడాలి. నా పాదయాత్రలో రోజూ పోరాటం ఎదుర్కొన్నాను. 2019లో ఓడిపోయినా భయపడలేదు, 2024లో 91 వేల మెజారిటీతో గెలిచాను. ఆ రోజు భయపడి ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదు" అని అన్నారు. పరీక్షల్లో విఫలమైతే ఆత్మహత్యలకు పాల్పడటం సరికాదని, ఒక్క ఓటమి జీవితాన్ని నిర్ధారించదని విద్యార్థులకు ధైర్యం చెప్పారు.
యువత రాజకీయాల్లోకి రావాలి
యువత రాజకీయాల్లోకి రావాలని, తెలుగుదేశం పార్టీ వారికి సముచిత అవకాశాలు కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. పోరాట స్ఫూర్తిని అలవర్చుకోవాలని సూచించారు. మహిళా సాధికారత ప్రతి ఇంటి నుంచే మొదలుకావాలని, వారికి 33 శాతం రిజర్వేషన్ల అమలుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
యువతకు ఉద్యోగాల కల్పనే తమ ప్రభుత్వ ఏకైక అజెండా అని, పెద్ద పరిశ్రమలతో పాటు ఎంఎస్ఎంఈలకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలు యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు వేమూరి సాత్విక్, చరణ్ యాదవ్, సత్యసాయి పవన్ కుమార్, ఖ్యాతి వర్థిని పాల్గొన్నారు.