మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులు లేకుండా చేస్తాం: నారాయణ
- గుంటూరు, విశాఖలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఉన్నాయన్న నారాయణ
- 107 మున్సిపాలిటీల్లో ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడి
- వైసీపీ ప్రభుత్వం 150 లక్షల చెత్తను వదిలిపోయిందని విమర్శ
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను డంపింగ్ యార్డులు లేని పట్టణాలుగా మార్చేందుకు యత్నిస్తున్నామని ఏపీ మంత్రి నారాయణ చెప్పారు. ప్రస్తుతం గుంటూరు, విశాఖలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఉన్నాయని తెలిపారు. మరో ఆరు ప్లాంట్లను నెలకొల్పబోతున్నామని వెల్లడించారు. ఈలోగానే 107 మున్సిపాలిటీల్లో ఉత్పత్తి అయ్యే చెత్త నిర్వహణ కోసం ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. చెత్తను బయోగ్యాస్, కంపోస్ట్ గా మారుస్తామని చెప్పారు.
గత ప్రభుత్వం ప్రజల నుంచి చెత్త పన్ను వసూలు చేసిందని... అయినా 150 లక్షల చెత్తను వదిలిపోయిందని నారాయణ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వదిలేసిన చెత్తను తాము తొలగిస్తున్నామని చెప్పారు. మున్సిపాలిటీల చెత్తను స్వచ్ఛమైన శక్తిగా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వ్యర్థాల నుంచి కూడా సంపద సృష్టించడం కూటమి ప్రభుత్వ విధానమని చెప్పారు.