మహానాడు విజయాన్ని అందరికీ అంకితం చేస్తున్నా: నారా లోకేశ్

Nara Lokesh Dedicates Mahanadu Success to Everyone
  • విజయవంతంగా ముగిసిన టీడీపీ మహానాడు
  • తాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జరిగిన తొలి మహానాడు అన్న లోకేశ్
  • టీడీపీ టీమ్ కృషి వల్ల మహానాడు విజయవంతం అయిందన్న లోకేశ్
తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మహానాడు నిన్న విజయవంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ స్పందిస్తూ... మహానాడు విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృత‌జ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. కోట్లాది మంది టీడీపీ కుటుంబ సభ్యుల ఆశీస్సులతో తాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యానని... తాను ఈ పదవిని చేపట్టిన తర్వాత జరిగిన తొలి మహానాడు ఇదని అన్నారు. టీడీపీ టీమ్ కృషి వల్ల మహానాడు విజయవంతం అయిందని చెప్పారు.

మహానాడు 2026 విజయాన్ని పార్టీ నేత‌లు, కార్యకర్తలు, మ‌హానాడు క‌మిటీలు, పార్టీ కార్యాల‌య యంత్రాంగం, బ్యాక్ ఆఫీస్, సాంకేతిక సిబ్బంది, MYTDP, ITDP, అనుబంధ సంఘాలు, మీడియా మిత్రులు, సోష‌ల్ మీడియా అభిమానులు, ఎన్ఆర్ఐలు, మిత్రపక్షాలు, ప్రజలు, భద్రతా సిబ్బంది అందరికీ అంకితం చేస్తున్నానని తెలిపారు. మీ కృషికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని చెప్పారు. 

నెల్లూరులో జరగాల్సిన మహానాడును ప్రధాని మోదీ పిలుపుతో, అందరి ఆమోదంతో హైబ్రిడ్ విధానంలోకి మార్చామని లోకేశ్ తెలిపారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవడాన్ని చంద్రబాబు మనకు నేర్పారని... ఆ నేర్పును హైబ్రిడ్ మహానాడుకు ఉపయోగించి విజయవంతం చేశామని చెప్పారు. ఇప్పుడు ప్రతి ఇల్లు, ప్రతి పల్లె మహానాడుకు వేదిక అయిందని అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిందని... ఇది మహానాడు సాధించిన మరో ఘన విజయమని చెప్పారు. 


Go Back to Shorts
Nara Lokesh
Mahanadu
Telugu Desam Party
TDP
Andhra Pradesh Politics
Chandrababu Naidu
Hybrid Mahanadu
TDP Workers
Political Conference
33 Percent Reservations for Women

More Telugu News