సెల్ఫీ వివాదంపై క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే
- ఓ ఈవెంట్లో సెల్ఫీ కోసం ప్రయత్నించిన అభిమాని
- పట్టించుకోకుండా వెళ్లిపోయిన పూజా హెగ్డే
- అంత పొగరా అంటూ అభిమానుల విమర్శలు
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించిన తాజా హిందీ చిత్రం ‘హై జవానీతో ఇష్క్ హోనా హై’ జూన్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. వరుణ్ ధావన్ హీరోగా, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న వేళ పూజా హెగ్డే ఒక వివాదంలో చిక్కుకుంది.
ఇటీవల ఒక ఈవెంట్లో ఓ అభిమాని సెల్ఫీ కోసం ప్రయత్నించగా, పూజా అతడిని పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెపై "అంత పొగరా" అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వివాదంపై పూజా హెగ్డే స్పందిస్తూ స్పష్టతనిచ్చింది. "సినిమా వాళ్లకు జీవితాన్ని ఇచ్చేది ప్రేక్షకులే. కొన్నిసార్లు హడావిడి పరిస్థితుల వల్ల అభిమానులను గమనించలేకపోవచ్చు. అంతేకానీ మాకు పొగరు ఉందని కాదు. మాకు ఎప్పుడూ అభిమానులే దేవుళ్లు, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు" అని పూజా వివరణ ఇచ్చింది.