హీరో విజయ్‌తో రిలేషన్ రూమర్స్.. పరోక్షంగా కౌంటర్ ఇచ్చిన నటి త్రిష!

Trisha social media post going viral
  • తన పెంపుడు కుక్క ఫొటోను షేర్ చేసిన త్రిష
  • తన వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడానికి దీన్ని మాత్రమే అనుమతిస్తానని వ్యాఖ్య
  • త్రిష 'మ్యాజికల్ మే' పోస్ట్ కూడా వైరల్ అవుతున్న వైనం

తమిళనాడు సీఎం, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో నటి త్రిష రిలేషన్‌లో ఉన్నారంటూ వస్తున్న వార్తలు కొన్ని రోజులుగా సినీ, రాజకీయ రంగాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సాధారణంగా తన వ్యక్తిగత విషయాలపై వచ్చే రూమర్లపై స్పందించని త్రిష, తాజాగా సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా స్పందించారు. తన పెంపుడు కుక్క ఫొటోను షేర్ చేస్తూ.. "నా వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడానికి దీన్ని మాత్రమే అనుమతిస్తాను" అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ పెట్టారు. నేరుగా ఎవరి పేరు ప్రస్తావించకపోయినప్పటికీ, తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారికి కౌంటర్‌గానే ఈ పోస్ట్ పెట్టారని అభిమానులు భావిస్తున్నారు.


మరోవైపు, మే నెల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ త్రిష చేసిన "మ్యాజికల్ మే" పోస్ట్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఏడాది మే నెలను తలచుకున్నప్పుడల్లా తన ముఖంపై చిరునవ్వు వస్తూనే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. మే నెలలోనే త్రిష పుట్టినరోజు ఉండడం, అదే సమయంలో తన ఆప్తమిత్రుడు విజయ్ తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీఎం కావడం విశేషం. దీనికి తోడు ఆమె నటించిన ‘కరుప్పు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌గా నిలిచి 348 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ వరుస విజయాల వల్లే ఆమె ఈ పోస్ట్ పెట్టారు.

Go Back to Shorts
Trisha
Vijay
Tollywood
Kollywood

More Telugu News