భారత ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన జర్మనీ

Germany announces visa free transit for Indian travellers
  • భారతీయులకు ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసాను రద్దు చేసిన జర్మనీ
  • రేపటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ప్రకటన
  • జర్మన్ ఛాన్సలర్ భారత పర్యటనలో భాగంగా ఈ నిర్ణయం
  • ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యమని వెల్లడి
భారత ప్రయాణికులకు జర్మనీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై జర్మనీలోని విమానాశ్రయాల మీదుగా ఇతర దేశాలకు ప్రయాణించే భారతీయులకు ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధన 2026 జూన్ 3 నుంచి అమల్లోకి వస్తుందని ఢిల్లీలోని జర్మన్ రాయబార కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ఏడాది జనవరిలో జర్మన్ ఫెడరల్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ భారత పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాయబార కార్యాలయం వివరించింది. భారత్-జర్మనీ సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ప్రజల రాకపోకలను సులభతరం చేయడం, ఆర్థిక బంధాలను పటిష్ఠం చేయడంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది.

ప్రధాని నరేంద్ర మోదీ, మెర్జ్ మధ్య జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. 2024లో రికార్డు స్థాయిలో ద్వైపాక్షిక వాణిజ్యం జరిగిందని, 2025లో కూడా అదే సానుకూల ధోరణి కొనసాగుతోందని అన్నారు. ఆ పర్యటనలో భాగంగా వాణిజ్యం, టెక్నాలజీ, ఆరోగ్యం, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో సుమారు 19 ఒప్పందాలు కుదిరాయి. ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఇరు నేతలు పునరుద్ఘాటించారు.
Go Back to Shorts
Germany announces visa free transit for Indian travellers
Germany good news to Indian travellers

More Telugu News