టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ సెంచరీ చేస్తే రాహుల్ గాంధీని ఆడుకుంటున్న నెటిజన్లు
- కివీస్ తో చివరి వన్డేలో కేఎల్ రాహుల్ శతకం
- ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సున్నా
- ట్విట్టర్ లో విజృంభించిన నెటిజన్లు
న్యూజిలాండ్ తో చివరి వన్డే సందర్భంగా టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ (112) అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఇటీవల సూపర్ ఫామ్ లో ఉన్న ఈ కర్ణాటక కుర్రాడు, ఏ స్థానంలో బ్యాటింగ్ కు దిగినా పరుగులు వెల్లువెత్తిస్తున్నాడు. అయితే రాహుల్ సెంచరీ సాధన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలకు కారణమైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో డకౌట్ అయిన కాంగ్రెస్ పార్టీని ప్రస్తావిస్తూ నెటిజన్లు రాహుల్ గాంధీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
ఒక రాహుల్ సెంచరీ చేసి హీరో అయ్యాడు, మరో రాహుల్ జీరో అయ్యాడు అంటూ ఎద్దేవా చేశారు. నేను కేఎల్ రాహుల్ లా అవ్వాలనుకుంటాను, కానీ రాహుల్ గాంధీలా మిగిలిపోతున్నాను అంటూ మరో నెటిజన్ వ్యంగ్యం ప్రదర్శించాడు. మరో నెటిజన్ తత్వాన్ని బోధించాడు. జీవితం నిన్ను రాహుల్ ను చేస్తే దాన్ని గాంధీలా కాదు, కేఎల్ గా మార్చుకో! అంటూ వ్యాఖ్యానించాడు. కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించాలంటే రాహుల్ గాంధీ స్థానాన్ని కేఎల్ రాహుల్ తో భర్తీ చేయాలని మరో వ్యక్తి స్పందించాడు.