రైతుల వెతలు తీర్చితే కేసీఆర్ పుట్టినరోజును రైతుల దినోత్సవంగా జరుపుతాం: జీవన్ రెడ్డి
- రైతు రుణమాఫీపై టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జీవన్ రెడ్డి
- కేంద్రంపై నెపం మోపుతూ పబ్బం గడుపుకుంటోందని ఆగ్రహం
- రైతు రుణాలపై 6 శాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని డిమాండ్
రైతు సమస్యల విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి టీఆర్ఎస్ సర్కారుపై ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పాలని నిలదీశారు. కేంద్రంపై నిందలు మోపుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని ఆరోపించారు. రైతులకు ఇచ్చే రుణాలపై 6 శాతం వడ్డీ రాయితీ ప్రకటించాలని, కందులు, పసుపుకు గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రైతుల వెతలు తీర్చితే కేసీఆర్ పుట్టినరోజును రైతుల దినోత్సవంగా జరుపుతామని అన్నారు. రైతుల కోసం వచ్చే బడ్జెట్ లో అయినా నిధులు కేటాయించాలని, రైతులకు సహకార సంఘాలు రుణ సౌకర్యం కల్పించాలని కోరారు.
రైతుల వెతలు తీర్చితే కేసీఆర్ పుట్టినరోజును రైతుల దినోత్సవంగా జరుపుతామని అన్నారు. రైతుల కోసం వచ్చే బడ్జెట్ లో అయినా నిధులు కేటాయించాలని, రైతులకు సహకార సంఘాలు రుణ సౌకర్యం కల్పించాలని కోరారు.