సీఏఏకు వ్యతిరేకంగా డీఎంకే మిత్రపక్షాలు 2 కోట్ల సంతకాల సేకరణ!
- ఈనెల 2 నుంచి 8 వరకు వారంపాటు కార్యక్రమం
- వాటిని రాష్ట్రపతికి అందజేసిన కూటమి ఎంపీలు
- పౌరసత్వ చట్టాన్ని ఉపసంహరించుకునేలా చూడాలని వినతి
దేశవ్యాప్తంగా అగ్గి రాజేసిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తమిళనాడులో డీఏంకే, దాని మిత్రపక్షాలు రెండు కోట్ల సంతకాలు సేకరించాయి. ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో పలువర్గాల నుంచి ఈ సంతకాలు సేకరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రజావ్యతిరేకతను తెలియజేసే ఈ సంతకాల పేపర్లను డీఎంకే, దాని మిత్రపక్షాల ఎంపీలు నిన్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు అందజేశారు. పౌరసత్వ చట్టంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అందువల్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బిల్లును ఉపసంహరించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తూ ఎంపీలు ఓ వినతిపత్రాన్ని కూడా అందజేశారు.