చైనా కంటే ఇండియానే ప్రమాదకరం: మిఖాయెల్ బ్లూంబర్గ్
- వాతావరణ కాలుష్యం విషయంలో ఇండియానే పెద్ద సమస్య
- ఈ విషయంలో ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు
- ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి అమెరికా బయటకు రావడం పెద్ద తప్పు
కర్బన ఉద్గారాలు, వాతావరణ మార్పుల విషయంలో చైనా కంటే ఇండియానే ఎక్కువ ప్రమాదకరమని న్యూయార్క్ మాజీ మేయర్, అమెరికా అధ్యక్ష స్థానాన్ని అలంకరించాలని కలలుకంటున్న డెమొక్రాటిక్ సభ్యుడు మిఖాయెల్ బ్లూంబర్గ్ అన్నారు. డెమొక్రాటిక్ ప్రెసిడెన్షియల్ ప్రైమరీ డిబేట్ లో ఆయన తొలిసారి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
2015 ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి బయటకు రావడం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదమని బ్లూంబర్గ్ అన్నారు. వాతావరణ కాలుష్య నివారణ దిశగా చైనా ఎంతో చేస్తోందని... కానీ ఇండియా పెద్ద సమస్యగా మారిందని చెప్పారు. ఈ విషయంలో ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు. చైనాతో అన్ని సంబంధాలను తెంచుకోలేమని... ఎందుకంటే చైనా, ఇండియా, పశ్చిమ యూరప్, అమెరికా లేకుండా గ్లోబల్ వార్మింగ్ కు చెక్ పెట్టలేమని తెలిపారు.